క్రేజీ : “థీమ్ ఆఫ్ బ్రో”..ఇది కదా కావాల్సింది 

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తాను గెస్ట్ రోల్ లో నటించిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “బ్రో ది అవతార్” కూడా ఒకటి కాగా ఈ చిత్రం అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్రఖని తెరకెక్కించగా ఈ సినిమాపై హైప్ ఇప్పుడు కాస్త కొంచెం అటు ఇటుగానే ఉంది. అయితే టీజర్, ఫస్ట్ లుక్ లతో వచ్చిన హైప్ ని మేకర్స్ సినిమాలో మొదటిగా రిలీజ్ చేసిన రెండు పాటలతో అయితే తగ్గించేశారు. దీనితో బ్రో పై చాలా మందిలో ఆసక్తి తగ్గింది.

దీనితో కావాల్సిన హైప్ కోసం అంతా చూస్తుండగా లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా థీమ్ సాంగ్ ని ఇప్పుడు రిలీజ్ చేసారు బ్రో థీమ్ సాంగ్ అంటూ వచ్చిన ఈ సాంగ్ అయితే సినిమాకి కావాల్సిన హైప్ ని ఇప్పుడు కొట్టేసింది అని చెప్పాలి.

కాగా ఈ చిత్రం లోని కాలంపై డిజైన్ చేసిన సాంగ్ చాలా యూనిక్ గా ఉండగా ఫ్యాన్స్ కి సహా మ్యూజిక్ లవర్స్ కి అదిరే ట్రీట్ ని ఇచ్చి ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ నుంచి సినిమాకి హైప్ మారుతుందేమో చూడాలి. కాగా ఈ చిత్రంలో కేతిక శర్మ అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్స్ గా నటించగా మాటలు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా ఈ జూలై 28న రిలీజ్ కాబోతుంది.