టాలీవుడ్ విలక్షణ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. రూమర్లు రాసే వెబ్ సైట్లకు, కౌంటర్లు వేసే నెటిజన్లకు అదిరిపోయే పంచ్‌లు వేస్తాడు. ఇక వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే చాటింగ్, ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. లాక్డౌన్ కాలంలో బ్రహ్మాజీ చేసిన పోస్ట్‌లు, వేసిన సెటైర్లు బాగా వర్కౌట్ అయ్యాయి.
లాక్ డౌన్ కాలాన్ని పెంచుకుంటూ పోవడం, ఉపాధి లేక అందరూ అల్లల్లాడిపోవడంపై వెరైటీ పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ. అయితే బ్రహ్మాజి నిన్న చేసిన ఓ పోస్ట్ సెన్సేషన్ అయింది. బ్రహ్మాజీకి ఓ కొడుకు ఉన్నాడు. మొన్నీమధ్యే ఓ పిట్ట కథ అంటూ మన ముందుకు వచ్చాడు. ఆ హీరో పేరు సంజయ్ రావ్. ఇతని భార్య పేరు అనుకృతి దీక్షిత్. అయితే నిన్న డాటర్స్ డే సందర్భంగా.. తన కోడలే తన కూతురు అని భావిస్తానని చెబుతూ ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు బ్రహ్మాజీ.
ఆ ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ డాటర్స్ డే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మీకు కూతురు ఎక్కడుందని కొందరు కామెంట్లు చేశారు. మీ జోడి అదిరింది అంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. మీ వైఫ్ బాగుంది సర్ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఇలా రకరకాల కామెంట్లు చేసే సరికి బ్రహ్మాజీ చిక్కుల్లో పడ్డారు. అందరూ ఇలా అంటున్నారేంటి అనుకున్నాడో ఏమో గానీ.. మళ్లీ కాసేపటికి ఓ కామెంట్ చేశాడు. ఆమె నా కోడలు.. నా కూతురిలా అని చెబుతూ అందరి నోర్మూయించాడు. ఏది ఏమైనా ఇదంతా బ్రహ్మాజి అందం వల్లే వచ్చింది. ఎక్కడా వయసు కనిపించకపోవడంతో అందరూ ఇలా అపార్థం చేసుకుని ఉండొచ్చు.