ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ హవా కానీ ఏ లెవెల్లో ఉందొ చూస్తున్నాము. మన నుంచి వస్తున్నా పవర్ ఫుల్ కంటెంట్ తో అయితే తెలుగు సినిమాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అంటూ టాలీవుడ్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఎలాంటి సినిమాలు తీసేసినా చూస్తారా అంటే పొరపాటే.
ఇప్పుడు ఇదే తరహాలో లేటెస్ట్ గా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న “స్కంద” సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా పరువు తీసేలా అనిపిస్తుంది అని చెప్పక తప్పదు. అసలు ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఎంత మాస్ మూవీ లవర్స్ అయినా కూడా బోయపాటిని తిట్టకుండా ఉండలేరు.
సేమ్ అదే రొటీన్ ప్లాట్ తో ఓవర్ ఏక్షన్ సీన్ లు ఎమోషన్స్ ఏవ్ డైలాగులు ఇంకా అదే రోత అట్మాస్పియర్ ని బోయపాటి చూపించాడు. పోనీ ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఏదన్నా ఉంటుందా అనుకుంటే అది కూడా లేదు. సినిమా టైటిల్ చూసి చాలా మంది ఇది కూడా అఖండ తరహాలో ఏదో డివోషనల్ ఏక్షన్ డ్రామా అనుకున్నారు కానీ ట్రైలర్ చూసాక అదే రోత టేకింగ్ అని చెప్పక తప్పదు.
ఇక మొత్తంగా అయితే ఇలాంటి ఒక సినిమాని పాన్ ఇండియా వైడ్ అనౌన్స్ చేయడమే షాకింగ్ అంటే ఒకవేళ ఇదే రకంగా రిలీజ్ చేస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సినిమా మీద ఆగిన ట్రోల్స్ అన్నీ మళ్ళీ మొదలయ్యేలా ఉన్నాయని చెప్పక తప్పదు. మరి అసలు బోయపాటి ఏం చేయాలి అనుకుంటున్నాడో ఏమో తనకే తెలియాలి.