Mahesh Babu : బాలయ్య డైరెక్టర్ తో మాస్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మహేష్..!

Mahesh Babu : మహేష్ బాబు వరుస సినిమాలతో అభిమానులకు షాక్ ఇస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. సినిమా నుండి విడుదలైన రెండు పాటలు సామాజిక మధ్యమాలను ఉపేస్తున్నాయి. అయితే సినిమాలో మహేష్ లుక్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇక మహేష్ స్వయంగా ఈ సినిమా లో పోకిరి తరహా క్యారెక్టర్ అని చెప్పడం తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి ఈ సినిమా ను మే లో విడుదల చేయడానికి సన్నాహాలు చెస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఈ మూవీ తరువాత మహేశ్‌ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత రాజమౌళితో ఓ భారీ మూవీకి మహేశ్‌ శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

రాజమౌళి మూవీ తరువాత మహేశ్‌ ఓ మాసీవ్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఊర మాస్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా అయిన బోయపాటి ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌ వినిపిస్తుంది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి మహేశ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.