ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు చిత్రాల్లో అయితే కాస్త అంచనాలు ఉన్న కొద్దో గొప్ప చిత్రాల్లో రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “స్కంద” కూడా ఒకటి. అయితే రామ్ ఏం నమ్మి సినిమా చేసాడో కానీ సినిమాపై మాత్రం ఏమంత గొప్ప అంచనాలు రాలేదు.
ట్రైలర్ చూసాక రొటీన్ గానే ఉంది కానీ ఫైనల్ గా సినిమాలో ఏదన్నా డిఫరెంట్ ఉంటుంది అనే ఒక చిన్న పాజిటివ్ హోప్ లో ఉన్నారు. కాగా ఈ సినిమా విషయంలో ఇప్పుడు మేకర్స్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు కానీ దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం ఎక్కడా అసలు కనిపించడం లేదు.
మరి దీనికి ఓ కారణం కూడా ఉందట. దీనితో అయితే తాను గతంలో చేసిన “అఖండ” సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడని సినీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో అఖండ కి కూడా తాను ఎక్కడా ప్రమోషన్స్ కి రాలేదు సినిమా హిట్ అయ్యిన తర్వాతే తాను డైరెక్ట్ గా సక్సెస్ మీట్ కి వచ్చి ఆ నెక్స్ట్ నుంచి ఇతర ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు.
దీనితో ఇదే సెంటిమెంట్ ని మళ్ళీ బోయపాటి తీసుకున్నారట. అందుకే సినిమా రిలీజ్ ముందు ఎలాంటి ప్రమోషన్స్ లో తాను కనిపించడం లేదని టాక్. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. అఖండ చూసాక ఆ ఎలివేషన్స్ ని భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి మళ్లీ బోయపాటి ఆ రేంజ్ మ్యాజిక్ ఏదన్నా చేస్తే తప్ప స్కంద గట్టెక్కేలా లేదని చెప్పాలి.