తమిళ సెన్సేషన్ “విడుదల” డే 1 తెలుగు వసూళ్లు.!

గత కొన్ని వారాల కితమే కోలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఓ రా పోలీస్ డ్రామా “విడుదలై పార్ట్ 1” సెన్సేషనల్ హిట్ అయ్యింది. కాగా ఈ సినిమా అక్కడ అందుకున్న భారీ సక్సెస్ తో వెంటనే టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ వెంటనే తెలుగు డబ్బింగ్ హక్కులు తీసేసుకొని వెంటనే డబ్బింగ్ కూడా చేయించేసి గతంలో “కాంతారా” తరహాలో రిలీజ్ చేసేసారు.

అయితే మరీ అంత హడావుడి లేకుండానే రిలీజ్ అయ్యిన ఈ సినిమా దానికి అప్పటికే తెలుగులో ఉన్న బజ్ తో అయితే గట్టి ఓపెనింగ్స్ నే బాక్సాఫీస్ దగ్గర అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా శనివారం రిలీజ్ అయ్యిన ఈ సినిమా అయితే 1.2 కోట్ల గ్రాస్ తో మొదటి రోజే కోటికి పైగా గ్రాస్ అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇప్పుడు టాక్ కూడా బాగానే ఉండడంతో ముందు మరింత బెటర్ వసూళ్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.దర్శకుడు వెట్రిమారన్ రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో అయితే కమెడియన్ సూరి ఎంతో డెడికేషన్ తో నటించగా మరో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు అలాగే ఇళయరాజా అయితే ఈ సినిమాకి సంగీతం అందించారు.