లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన కాస్త చెప్పుకోదగ్గ రేంజ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం “స్కంద”.. టాలీవుడ్ మాస్ నిర్వచనాన్ని మార్చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన పక్కా మాస్ చిత్రమే ఇది.
మరి రామ్ సహా బోయపాటి ఉంచి మొదటి సినిమా ఇది కావడంతో అంచనాలు కూడా బాగానే వచ్చాయి. అప్పటికే రామ్ కూడా మాస్ ఆడియెన్స్ లో మంచి ఆదరణను దక్కించుకున్నాడు. దీనితో బోయపాటి లాంటి దర్శకుడుతో సినిమా అనగానే మాస్ లో మరిన్ని అంచనాలు వచ్చాయి.
అయితే ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ కి రాగ తెలుగు స్టేట్స్ లో అయితే క్రేజీ వసూళ్లు అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. కాగా ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు రిజిస్టర్ చేసిందట. మరి తెలంగాణలో అయితే ఈ చిత్రం 3.2 కోట్లకి పైగా షేర్ ని రాబట్టగా ఏపీ మొత్తం నుంచి 5 కోట్లకి పైగా షేర్ ని అందుకుంది.
దీనితో తెలుగు స్టేట్స్ నుంచే ఈ చిత్రంకి టోటల్ గా 8 కోట్లకి పైగా షేర్ వచ్చేసింది. దీనితో రామ్ పోతినేని కెరీర్ లోనే ఈ చిత్రం హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. కాగా తన కెరీర్ ల గతంలో వచ్చిన చిత్రం వారియర్ ని అయితే ఇది ఇప్పుడు క్రాస్ చేసింది. సో మొత్తానికి అయితే స్కంద మాస్ ఆడియెన్స్ లో మంచి పట్టు అందుకుందనే చెప్పాలి.