టాలీవుడ్ దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేకించిన మొదటి పాన్ ఇండియా చిత్రం “స్కంద” కూడా ఒకటి. అయితే ఇదే గత వారంలో కాస్త మాస్ సినిమా కావడంతో మాస్ ఆడియెన్స్ ని బాగానే ఫుల్ చేసింది.
అయితే ఈ చిత్రం ఇపుడు బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 5 రోజుల్లో అయితే ఈ సినిమా బాగానే వసూళ్లు అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా మేజర్ గా తెలుగు వెర్షన్ లోనే అంతా వసూళ్లు రాగా సో ఈ ఐదు రోజుల్లో స్కంద 50 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుందని తెలిపారు.
దీనితో స్కంద ఆల్ మోస్ట్ 25 కోట్ల మేర షేర్ ని టచ్ చేసింది. కానీ ఇది ఇంకా సరిపోదు సినిమాకి సుమారు 40 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే ఇంకా 15 కోట్ల షేర్ వస్తే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. మరి స్కంద అయితే ఈ టఫ్ పరిస్థితిలో గట్టెక్కుతుందో లేదో చూడాలి.
అసలు ఈ వారం అయితే దాదాపు 6 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. మరి చూడాలి ఏమవుతుంది అనేది. కాగా ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు నటించారు. అలాగే థమన్ సంగీతం అందించగా శ్రీనివాస చిట్టూరి నిర్మాణం వహించారు.