బాక్సాఫీస్ రిపోర్ట్ : ఫస్ట్ డే “హిట్ 2” కి అదిరిపోయిన వసూళ్లు.!

లేటెస్ట్ టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన మరో చిత్రం “హిట్ 2”. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ క్రేజీ థ్రిల్లర్ చిత్రం కాగా ఇందులో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అయితే టైర్ 2 హీరోస్ లో ఈ చిత్రం అదరగొట్టేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.

మరి ప్రస్తుత డీటెయిల్స్ ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ మొదటి రోజే సగానికి దగ్గరగా వసూళ్లు రాబట్టేసినట్టే తెలుస్తుంది. మరి ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ గా 14.5 కోట్ల బిజినెస్ ని చెయ్యగా మొదటి రోజే ఈ చిత్రం 6.5 కోట్ల మేర షేర్ ని వరల్డ్ వైడ్ ఈ చిత్రం అందుకుంది.

మరి గ్రాస్ అయితే 12 కోట్ల మేర వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఇది కేవలం ఫస్ట్ డే కి మాత్రమే కాగా ఇక ఈ శని ఆదివారాల్లో ఈజీగా టార్గెట్ దగ్గరకి ఈ సినిమా వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. ఇక కొన్ని ఏరియాల్లో వసూళ్లు చూస్తే నైజాం లో 1.92 కోట్లు ఏపీలో 2.1 కోట్లు షేర్ ని రాబట్టింది.

అలాగే ఓవర్సీస్ లో అయితే హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకుని బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సత్తా చాటింది. మొత్తానికి అయితే ఈ చిత్రం విజయం నాని బ్యానర్ లో ఓ సాలిడ్ హిట్ అని చెప్పి తీరాలి.