బాక్సాఫీస్ రిపోర్ట్ : కుమ్మేసిన “ధమాకా” ఫస్ట్ వీక్ టోటల్ వసూళ్లు.!

మాస్ మహారాజ రవితేజ నుంచి ఎట్టకేలకు ఓ సాలిడ్ హిట్ కావాలని కోరుకుంటున్న అభిమానులకి అయితే ఈ ఏడాదిలోనే ఆన్సర్ దొరికేసింది. మరి ఈ చిత్రం “ధమాకా” కాగా ఇప్పుడు ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ దిశగా దూసుకెళ్తుంది. ఇక మొదటి మూడు రోజుల్లోనే ఒకరోజు మించి మరో రోజు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం వారం మొదలు నుంచి కూడా స్టాండర్డ్ వసూళ్లు కొల్లగొడుతూ ట్రేడ్ వర్గాలకి షాకిచ్చింది.

మరి మొదటి వారం ముగిసేసరికి అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ సాలిడ్ నంబర్స్ నమోదు చేసినట్టుగా చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. మరి ధమాకా అయితే ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ టోటల్ గా 62 కోట్లు రాబట్టినట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇందులో మేజర్ గ్రాస్ అంతా తెలుగు స్టేట్స్ నుంచే రాగా ఇప్పుడు ధమాకా సినిమాతో రవితేజ భారీ లాభాలు అయితే అందిస్తున్నాడు.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్ల లోపే అమ్ముడుపోగా ఇప్పుడు షేర్ దాదాపు 30 కోట్ల మేర టచ్ అవుతుంది. దీనితో ధమాకా మాత్రం వసూళ్ల పరంగా కుమ్మేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో గ్లామ్ క్వీన్ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు అలాగే భీమ్స్ అదిరే ఆల్బమ్ ని ఈ సినిమాకి అందించారు.