బాక్సాఫీస్ : తెలుగు స్టేట్స్ లో “జైలర్” డే1 వసూళ్ల బ్రేకప్!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మాసివ్ చిత్రం “జైలర్” సినిమా అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రమ్యకృష్ణ రజిని భార్యగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం.

రజినీ నుంచి మాసివ్ కం బ్యాక్ అన్నట్టుగా రిలీజ్ చేయగా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఇప్పుడు దక్కినట్టుగా తెలుస్తుంది. అయితే ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా ఓ రేంజ్ లో లేచిన హైప్ తెలుగు ఆడియెన్స్ లో కూడా భారీ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా ఇపుడు మొదటి రోజు జైలర్ కి అయితే తెలుగు రాష్ట్రాల్లో రజిని గత మూడు చిత్రాలు కంటే భారీ ఓపెనింగ్స్ దక్కినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ వసూళ్ల బ్రేకప్ చూసినట్టు అయితే నైజాంలో చిత్రం 3.2 కోట్ల షేర్ ని రాబట్టగా ఉత్తరాంధ్రలో 83 లక్షలు అలాగే సీడెడ్ లో 94 లక్షల షేర్ ని అందుకోగా ఇక మిగతా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణ నెల్లూరు అన్ని ఇతర జిల్లాలు కలిపి ఈ చిత్రం సుమారు 2 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.

దీనితో మొదటి రోజు జైలర్ తెలుగు స్టేట్స్ లో ఏకంగా 12 కోట్లకి పైగా గ్రాస్ ని అలాగే 7 కోట్లకి పైగా షేర్ ని అందుకున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో లాంగ్ రన్ లో జైలర్ భారీ వసూళ్లు సెట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఈ చివరి నెంబర్ ఎలా ఉంటుందో చూడాలి.