రామ్ చరణ్ కోసం జాన్వీ కపూర్.?

బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు సన, హీరోయిన్ ఎంపిక పనుల్లో బిజీ అయ్యాడు. ఇంకో వైపు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో సినిమా వ్యవహారాల్లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

కాగా, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తదానీకి స్క్రీన్ టెస్ట్ చేశాడట దర్శకుడు బుచ్చిబాబు సన. సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఇప్పటికే స్కెచెస్ రెడీ చేసుకున్న బుచ్చిబాబు సన అండ్ టీమ్, దానికి తగ్గట్టుగా రషా తదానీకి స్క్రీన్ టెస్ట్ హైద్రాబాద్‌లో పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

సైలెంటుగా వచ్చి వెళ్దామనుకున్న రషా తదానీని ఎయిర్ పోర్ట్ వద్ద మీడియా కెమెరాలు క్యాప్చర్ చేసేశాయ్.! అయితే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుండబోతున్నారనీ, ఓ హీరోయిన్‌గా రషా తదానీ పేరు ఖరారయ్యిందనీ అంటున్నారు.

మెయిన్ హీరోయిన్ రోల్ మాత్రం ఇంకా ఖరారవలేదట. ఆ పాత్ర కోసం జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. అయితే, ఈ విషయమై బుచ్చిబాబు సన కావొచ్చు, ఆయన టీమ్ కావొచ్చు సీక్రెసీని మెయిన్‌టెయిన్ చేస్తున్నారట.

జాన్వీ కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ సరసన ‘దేవర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, తెలుగులోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది.. సౌత్ సినిమాలు చేయడంలో అంత వేగమూ చూపించడంలేదు.