ఖరీదైన స్వెటర్ ధరించిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్… ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా సెలబ్రిటీలు వారికి స్థాయికి తగ్గట్టు ఖరీదైన వస్తువులను వినియోగిస్తూ ఉంటారు. విలాసవంతమైన ఖరీదైన ఇళ్లల్లో ఉంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటారు. అంతే కాకుండా వారు వేసుకునే దుస్తులు నుండి వాడే చెప్పుల వరకూ అన్నీ బ్రాండెడ్ వస్తువులను వాడుతూ ఉంటారు. ఇలా వీటి కోసం వారు భారీగా ఖర్చు చేస్తారు.ఇటీవల కత్రినా కైఫ్ కూడా ఒక ఖరీదైన స్వెట్టర్ ధరించింది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కేఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన మల్లేశ్వరి సినిమాలో నటించిన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కత్రినా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కత్రినా కైఫ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో కత్రినా కైఫ్ ధరించిన స్వెటర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ స్వెటర్ లో కత్రినా కైఫ్ ఎంతో అట్రాక్టివ్ లుక్ తో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

అయితే ఈ ఫోటోలలో కత్రినా కైఫ్ ధరించిన స్వెటర్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్య పోవడం మన వంతు అవుతుంది. ఈ ఫోటోలలో కత్రినా ధరించిన స్వెట్టర్ 100 శాతం పాలిస్టర్ తో తయారైంది. అలాగే డిఫరెంట్ అల్లికతో మల్టీ కలర్లో ఉండటం ఈ స్వెట్టర్ ప్రత్యేకత. ఇక ఈ స్వెట్టర్ కోసం కత్రినా 445 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీ లో అక్షరాల 35,000 రూపాయలు. ఈ స్వెట్టర్ ధర తెలిసి ఒక స్వెటర్ కోసం కత్రినా ఇంత మొత్తం ఖర్చు చేసిందా అని నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.