ఇల్లు అమ్మి భారీ మొత్తంలో లాభం పొందిన బాలీవుడ్ బ్యూటీ.. ?

Janhvi Kapoor Demands 5 Cr

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ జాన్వీ కపూర్. తన తల్లి వారసత్వం పుచ్చుకొని జాన్వీ కపూర్ దఢక్ సినిమా ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా హీరోయిన్ గా గుర్తింపు పొందిన జాన్వీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడికి సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా కూడా సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపటం లేదు. శ్రీదేవి అటు సౌత్ నార్త్ సినిమాలలో నటించి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందింది. అయితే జాన్వీ కపూర్ మాత్రం కేవలం బాలీవుడ్ కి పరిమితమయింది. శ్రీదేవి జీవించి ఉంటే తన లాగే తన కూతురిని కూడా పాన్ ఇండియన్ హీరోయిన్ గా చేసేది.

ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అందరూ దాదాపుగా ముంబైలోని అతి ఖరీదైన ప్రాంతమైన జూహులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ కి కూడా అక్కడ ఒక ఫ్లాట్ ఉంది. అయితే తాజాగా జాన్వీ ఆ ఫ్లాట్ ని అమ్మినట్లు తెలుస్తొంది. బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ రావు ముంబైలోని జూహులో ఉన్న జాన్వీ కపూర్ విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారని సమాచారం. రాజ్‌కుమార్‌ జాన్వీ కపూర్ తో కలిసి రూహి సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇటీవల జాహ్నవి కపూర్ ముంబైలోని జూహూలో ఉన్న ‘ లోటస్ ఆర్య ‘ అను పేరు గల అపార్ట్మెంట్ ని రాజ్‌కుమార్ రావుకి రూ. 44 కోట్లకు విక్రయించింది.

జుహు ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ 14, 15, 16 అంతస్తుల వరకు ఉంటుంది. ఈ అపార్ట్‌మెంట్ 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జాన్వి కపూర్ రెండు సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్ ని రూ.39 కోట్లకు కోనుగోలు చేసింది. ఇక ఇప్పుడు దీనిని రాజ్‌కుమార్ రావు రూ.44 కోట్లకు కోనుగోలు చేశాడు. దీంతో ఈ అపార్మెంట్ అమ్మటం వల్ల జాన్వీ రూ.5 కోట్ల రూపాయలు లాభం పొందింది. దేశంలోనే అత్యంత ఖరీదైన డీల్స్ లో ఇది కూడా ఒకటి. ఇదిలా ఉండగా రాజ్‌కుమార్ రావు ఆయన భార్య పాత్రలేఖతో కలిసి ఇదే అపార్ట్మెంట్ లో 11,12 అంతస్తుల్లో జీవించేవారు. ఇక ఇప్పుడు 14,15,16 అంతస్తులను కూడా కోనుగోలు చేశారు.