గెట్ రెడీ..”SSMB28″ టీజర్ పై బిగ్ అప్డేట్.!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కాగా దీనిపై సెన్సేషనల్ హైప్ ఉంది. కాగా ఈ సినిమా మొదటగా ఒక స్క్రిప్ట్ తో మొదలు పెట్టి ఇప్పుడు కొత్త కథ చేస్తున్నారు.

ఇక ఈ షూటింగ్ కూడా విడతల వారీగా జరుగుతూ ఉండగా అప్డేట్స్ అయితే మేకర్స్ ఒకొక్కటిగా అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ అయితే ఓ బిగ్గెస్ట్ అప్డేట్ ని రివీల్ చేసాడు. ఇది వరకే ఈ మే చివరన కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా మాసివ్ ట్రీట్ ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇప్పుడు దీనిపై అయితే క్లారిటీ ఇస్తూ టీజర్/గ్లింప్స్ అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మా సినిమాపై చాలా మంది లేని పోనీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని అవన్నీ చూస్తుంటే నవ్వొస్తుంది అని అలాగే వాటిని చూసి నవ్వి ఊరుకుంటామని మా సినిమా అనుకున్నట్టుగా జనవరిలో 2024న వస్తుంది అని తెలిపారు.

అంతే కాకుండా మొన్న ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. ఈసారి మే 31న వచ్చే ట్రీట్ తో మోత మోగిపోతుంది అన్నట్టుగా క్రేజీ అప్డేట్ అందించారు. దీనితో ఈ సెన్సేషనల్ అప్డేట్ వైరల్ గా మారింది. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.