బిగ్‌బాస్ షో గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభమైందంటేనే అదో పండుగ. ఇక సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో మీద వచ్చే ట్రోల్స్, కామెంట్స్, కంటెస్టెంట్ల చర్చలు, గొడవలు ఇలా ఎన్నో రకాలుగా జనాల నోళ్లలో నానుతూ ఉంటుంది. అయితే అన్నింటి కంటే ముఖ్యంగా బిగ్ బాస్ వాయిస్‌పై నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే ఆ బిగ్ బాస్ ఎవరన్నది ఎవ్వరికీ తెలియదు. అసలు బిగ్ బాస్ ఉంటాడా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. అతనికి గొంతు మాత్రమే ఉంటుంది. ఆయనకు శరీరం ఉండదు. అయితే అందులో వినబడే గొంతు గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.
బిగ్‌బాస్ 4 సీజన్ మొదలైనప్పటి నుంచి ఒకటే వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆ వాయిస్ ఓవర్ ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ది. ఆ గంభీరమైన వాయిస్‌ను ఎన్నో సినిమాల్లో కూడా విన్నాం. అతనెవరో కాదు.. సినిమాలు, సీరియల్స్, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణదే బిగ్ బాస్ వాయిస్. అయితే ఈయన గొంతునే సెలెక్ట్ చేసుకోవడం వెనుక చాలా తతంగమే నడిచిందట.
తొలి సీజన్ మొదలయ్యే ముందు షో నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించారట. ఆఖరికి రాధాకృష్ణ గొంత సరిపోతుందని నిర్ణయానికి వచ్చారట. బిగ్‌బాస్ రాధాకృష్ణ మాట్లాడే మాటల్లో కనిపించే గాంభీర్యం బాగా నచ్చి అతనిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో ప్రతీ రోజూ ఎన్నిసార్లు వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. అందరూ ఆ వాయిస్‌ను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. అదీ ఆ వాయిస్ రేంజ్.