Home News బిగ్ బాస్‌4 : 'మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్'..స్క్రిప్ట్ రెడీ చేసిన బిగ్ బాస్ టీమ్ !

బిగ్ బాస్‌4 : ‘మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్’..స్క్రిప్ట్ రెడీ చేసిన బిగ్ బాస్ టీమ్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. కొత్త సీజన్ దాదాపు ముగింపుకు చేరుకోవడంతో, ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. టాప్ కంటెస్టెంట్లు అందరూ ఇప్పుడు ఇంట్లో తమని తాము కాపాడుకోడానికి అస్త్రశస్త్రాలు వినియోగిస్తున్నారు. టాస్కులు ఇచ్చినప్పుడు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఒక షో యొక్క సక్సెస్‌ను కౌంట్ చేయాలంటే టీఆర్‌ప్పీనే ప్రధానంగా భావిస్తారు. దీంతో బిగ్ బాస్ సో టాప్ రేటింగ్ దక్కించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Bigg Nag | Telugu Rajyam

కాగా తెలుగు బిగ్ బాస్ షో ఈసారి రొమాన్స్‌కు పెద్ద పీఠ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మితిమీరిన హగ్గులు, కిస్సులతో హౌస్ నిండిపోయింది. ఇటీవల మోనల్-అఖిల్ కిస్సుల వ్యవహారాన్ని వీక్షకులు సీరియస్‌గా తీసుకున్నారు. అసలు షో చూడాలా వద్దా అంటూ నాగార్జున టార్గెట్‌గా ట్రోలింగ్ మొదలెట్టారు. ఇప్పటికే బిగ్ బాస్ దత్త పుత్రిక మోనల్ అంటూ ముద్ర పడిన విషయం తెలిసిందే. ఇంత అశ్లీలతకు కారణం అవుతున్నా ఆమెను హౌస్‌లో ఉంచితే ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

ఈ క్రమంలో, మోనాల్‌కు నిష్క్రమణ తలుపు చూపించాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు భావిస్తున్నారు., నాగార్జున మోనాల్ గజ్జర్‌ను హౌస్ నుంచి బయటకు పంపిచ్చవచ్చని బలంగా నమ్ముతున్నారు. ‘మోనాల్ గజ్జర్ ఎలిమినేటెడ్’ అని నాగార్జున చెబితే ఆశ్చర్యపోకుండా ఉండటానికి సిద్దంగా ఉండాలని నాగ్ సూచిస్తున్నారు. గత రాత్రి ఓవర్ డోస్ రొమాన్స్ తర్వాత, నెటిజన్లు ఇప్పటికే ‘మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ కన్ఫర్మ్డ్’ అని చెబుతున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం. వోటింగ్ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం చివరి స్థానం కోసం మోనల్, లాస్య పోటీ పడుతున్నారట. లాస్యకు 12 శాతం ఉండగా, మోనల్ కు 11 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. వంట చేయడంతో పాటు రీసెంట్ గా వర్కువుట్ అయిన మదర్ సెంటిమెంట్ కూడా కలబోసి లాస్యను ఉంచి..మోనల్ కు బిగ్ బాస్ గేట్లు తెరవనున్నారట.

- Advertisement -

Related Posts

వాళ్ళందరికీ ఫోన్లు చేస్తోన్న కే‌సి‌ఆర్ – ఎందుకంటే.. 

తెరాస అధినేత కేసీఆర్ కు ఎన్నిక ఏదైనా ముందు సర్వేలు చేయించుకోవడం అలవాటు.  ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఆ విష్యం మీద జనం అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళేం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవడం కోసం...

సుకుమార్ రెమ్యూనరేషన్ అంతా ?? రాజమౌళి , త్రివిక్రమ్ కూడా పనికిరారు.

సుకుమార్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. సుకూమార్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా ఆర్య తోటే ఒక క్రేజ్ వచ్చేసింది. ఆ...

Raai Laxmi Recent Pictures

Raai Laxmi Telugu Most popular Actress, Raai Laxmi Recent Pictures ,Tollywood Raai Laxmi Recent Pictures,Raai Laxmi Recent Pictures Shooting spot ,Raai Laxmi ,Raai Laxmi...

Neha Malik Amazing Looks

Neha Malik Hindi Most popular Actress, NNeha Malik Amazing Looks ,Bollywood Neha Malik Amazing Looks,Neha Malik Amazing Looks Shooting spot ,Neha Malik ,Neha Malik...

Latest News