Bigg boss 4: అఫీషియల్.. బిగ్ బాస్ షో ప్రారంభం అయింది.. ఫస్ట్ ఎపిసోడ్ టీజర్ ఇదిగో..!

bigg boss telugu 4 launch teaser

ఇక రిలాక్స్ అవండి.. బిగ్ బాస్ అభిమానులారా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభం అయింది. శనివారమే మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ ను బిగ్ బాస్ యాజమాన్యం రిలీజ్ చేసింది.

bigg boss telugu 4 launch teaser
bigg boss telugu 4 launch teaser

కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్లిపోయారు. ఇక చూస్కోండి.. మున్ముందు ఉంటుంది ఎంటర్ టైన్ మెంట్. తెలుగు ప్రేక్షకులకు ఇక ఈరోజు నుంచి కావాల్సినంత వినోదం.

టీజర్ లో నాగార్జున ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. మాస్కులు ముఖానికి కానీ… ఎంటర్ టైన్ మెంట్ కు కాదు..అంటూ నాగ్ వేసిన డైలాగ్ కు విజిల్ వేయాల్సిందే.

కరోనా నేపథ్యంలో అసలు.. ఈ షో ప్రారంభం అవుతుందా? కాదా? అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. బిగ్ బాస్ షో ప్రారంభానికి ఎన్నో అడ్డంకులు. కంటెస్టెంట్లలో కొందరికి కరోనా కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ అభిమానులు తమ హోప్స్ ను వదిలేశారు.

కానీ..అన్ని అడ్డంకులను దాటుకొని బిగ్ బాస్ షో.. ఆదివారం సాయంత్రం నుంచి అలరించనునంది. మొదటి ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 కు షో టెలికాస్ట్ అవుతుంద. శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకే ప్రారంభం అవుతుంది.

గత సీజన్ల మాదిరిగానే.. శని, ఆదివారాలు… హోస్ట్ నాగార్జున వచ్చి.. ఇంటి సభ్యులను పలకరిస్తుంటారు. కొన్ని టాస్కులు ఇస్తుంటారు.

కంటెస్టెంట్లు ఎవరు.. అనేదానికపై మాత్రం ఇప్పటివరకు మాటీవీ కూడా అధికారికంగా చెప్పలేదు. సాయంత్రం ప్రారంభం అయ్యే మొదటి ఎపిసోడ్ తో కంటెస్టెంట్లు ఎవరో తెలియనుంది. 

అయితే.. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన ఫైనల్ లిస్టు ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు చక్కర్లు కొడుతున్నా… షో ప్రారంభం అయితే కానీ.. అసలు కంటెస్టెంట్లు ఎవరో తెలిసే అవకాశం ఉంది. 

మొత్తానికి బిగ్ బాస్ అభిమానులకు ఈరోజు నుంచి పండగే ఇక. మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ కూడా పనిలో పనిగా చూసేయండి.

The wait is over for the BIGG day!!! Let's celebrate #BiggBossTelugu4 today at 6 PM on #StarMaa