Anchor Shiva: బిగ్ బాస్ నాన్ స్టాప్… ఈవారం కెప్టెన్సీ గా యాంకర్ శివ…నెగిటివిటీ మూటకట్టుకున్న ఆషు..!

Anchor Shiva: టాలీవుడ్ లో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతో క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం టెలివిజన్లో ప్రసారం కాకుండా ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో కి ప్రేక్షకుల ఆదరణ తగ్గింది. ఓటిటి
లో 24/7 ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ప్రేక్షకులు ఆశించిన రీతిలో లేకపోవడంతో ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు కెప్టెన్సీ కోసం పడే పాట్లు అన్నీ ఇన్ని కావు.

ఈవారం కెప్టెన్సీ విషయానికి వస్తే కెప్టెన్సీ కోసం పెట్టిన “ఎత్తర జెండా” అనే టాస్క్ లో అషురెడ్డి సంచాలకురాలిగా వ్యవహరించింది. అఖిల్ టీమ్ నీ ఎలాగైనా గెలిపించాలన్న తాపత్రయంతో ఆషు రెడ్డి హమీద జంటను టాస్క్ నుండి తప్పించటానికి సిల్లీ రీజన్ చెప్పి ఈ టాస్క్ నుండి తప్పించేసింది. కెప్టెన్సీ కోసం పెట్టిన టాస్క్ పూర్తయ్యేసరికి నటరాజ్, శివ, మిత్ర, మహేష్‌లు కెప్టెన్సీదారులుగా ఎంపికయ్యారు.

కెప్టెన్సీ కోసం హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఎట్టకేలకు శివ గెలుపొంది ఈవారం కెప్టెన్సీ పదవిని దక్కించుకున్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూసిన కెప్టెన్సీ పదవి రావడంతో శివ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ టాస్క్ లో సంచాలకురాలుగా వ్యవహరించిన ఆశు రెడ్డి తన ప్రవర్తనతో నెగిటివిటీ మూటగట్టుకుంది. ఇక కెప్టెన్సీ గెలుపొందిన శివ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.