తొమ్మిదో వారంలో నామినేట్ అయిన సభ్యులందరిలో ఒక్కరు సేవ్ అయ్యే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. మొహం జాగ్రత్త అనే టాస్కులో అభిజిత్ మధ్యలోనే ఆత్మ గౌరవం అనే పేరు చెప్పి వదిలేశాడు. అదే అంశాన్ని ప్రస్థావించి అభిజిత్‌ను నిలబెట్టి క్లాసు పీకాడు. అంటే నీకు ఒక్కడికే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మిగతా వాళ్లకు లేదనే నీ ఉద్దేశ్యమా? అని నాగార్జున సూటిగా అడిగి పరువుతీశాడు. నేను నా ఒక్కడి గురించి కాదు.. అందరి గురించి అన్నాను అంటూ అభిజిత్ చెప్పుకున్నాడు.
నువ్ చేసిన కరెక్టా? కాదా? అన్నది ఇంటి సభ్యులనే అడుగుదామని నాగార్జున అన్నాడు. ఆత్మ గౌరవం పేరు చెప్పి టాస్కును వదలడం కరెక్టేనా? అని కంటెస్టెంట్లను అడిగాడు. కానీ ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. అలా అనడం తప్పే కానీ నేను బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ చేశాకే వదిలేశాను. చివరకు ఏ ఒక్కరో మిగలాలి.. అలా అయితేనే ఆ ఒక్కరికి ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు అది కూడా ఓ కారణమే కానీ నేను అది చెప్పలేదు అని అభిజిత్ చెప్పుకొచ్చాడు.
నువ్ ఆ కారణం చెప్పి దిగి ఉంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టేవారు అని నాగార్జున అభిజిత్‌ను టార్గెట్ చేశాడు. తెలుగు మాట్లాడమంటే మాట్లాడవు అని నాగార్జున అంటే.. ముప్పై యేళ్లు ఒకలా ఉండి.. మూడు నెలల్లో మారడమంటే కష్టం కదా అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. మరి అలానే ఇన్నేళ్ల నుంచి అమ్మ రాజశేఖర్ వ్యక్తిత్వమే అది కదా ఎలా మారతాడు అని అభిజిత్‌కు నాగార్జున కౌంటర్ వేశాడు. అది కూడా నిజమే అని ఏం చెప్పాలో తెలియక అభిజిత్ తెల్లమొహం వేశాడు.