తొమ్మిదో వారంలో ఇళ్లంతా రచ్చగా మారింది. పల్లెకు పోదాం చలో చలో టాస్కులో కంటెస్టెంట్లందరూ బాగానే పార్టిసిపేట్ చేశారు. ఆ టాస్క్ తరువాత హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్‌లు రింగులో రంగు అనే టాస్క్ ఆడారు. కెప్టెన్సీ కోసం సాగిన ఈ ఆటలో అమ్మ రాజశేఖర్ గెలుపొందాడు. కెప్టెన్ అయ్యాకే అమ్మ రాజశేఖర్ అసలు స్వరూపం బయటకు వచ్చింది. తన గ్రూపుకు ఎలాంటి పనులు అప్పగించకుండా అభి గ్రూపు నెత్తిపైనే అన్ని పనులు వేయాలని చూశాడు.
ఏ కంటెస్టెంట్ ఏ ఏ పనులు చేయాలో డిసైడ్ చేసే అమ్మ రాజశేఖర్ స్వార్థాన్ని చూపించాడు. తన గ్యాంగ్‌లో ఉన్న అవినాష్, మెహబూబ్‌లకు కేవలం బాత్రూంలు కడిగే పనే అప్పగించాడు. దీంతో మిగతా వారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వారిపై రెండు మూడు పనులు మోపిన అమ్మ రాజశేఖర్ అవినాష్, మెహబూబ్ విషయంలో అలా చేయడంతో అందరూ తిరగబడ్డారు. చేస్తే చేయండి లేదంటే లేదు నేను కెప్టెన్ నా ఇష్టమొచ్చినట్టు చెబుతాను అని అమ్మ రాజశేఖర్ అంత ఎత్తున లేచాడు.
కెప్టెన్ అన్నప్పుడు అందరూ ఏం ఏం చేస్తారో చేయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి. ఆ తరువాత పనులను కేటాయించాలి.. నేను కెప్టెన్‌ను చెప్పింది చేయాల్సిందే అంటే.. ఎవడికి నువ్ కెప్టెన్.. ఎవరిని బెదిరిస్తున్నావ్.. కెప్టెన్ అయితే ఏంటి.. భయపడేవారెవ్వరూ లేరిక్కడ అంటూ హారిక తన అభిప్రాయాలను అవినాష్, అరియానాలతో చెప్పింది. చివరకు అమ్మ రాజశేఖర్ తగ్గి తన వారికి కూడా పనులు అప్పగించాడు.