ఆమ్లేట్ కోసం అంత చేయాలా?.. అమ్మ రాజశేఖర్ హద్దులు దాటేశాడు!

Bigg boss 4 Telugu week 9 Dispute ABhijeet Between Amma Rajasekhar For Omelet

బిగ్ బాస్ షోలో చపాతీ కోసం గొడవలు, చికెన్-మటన్ కోసం గొడవలు జరిగాయి. నిన్నటి ఎపిసోడ్‌లో ఆమ్లేట్ కోసం గొడవ జరిగింది. పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్‌లో వంటను సిద్దం చేసే జంటగా అభిజిత్ మెనాల్ తమ పాత్రలను పోషించారు. ఎవరి దగ్గర ఎంత ధాన్యం తీసుకోవాలి.. ఏ ఏ పదార్థాలకు ఎంత తీసుకోవాలన్నది పూర్తిగా అభిజిత్ మోనాల్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. గ్రామస్థులు వారు వడ్లు దంచి ఆహారానికి బదులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో గ్రామస్థులు మాత్రం తమ పని కచ్చితంగా చేయకుండా వంట చేసే జంటపై చిందులు తొక్కారు.

Bigg boss 4 Telugu week 9 Dispute ABhijeet Between Amma Rajasekhar For Omelet
Bigg boss 4 Telugu week 9 Dispute ABhijeet Between Amma Rajasekhar For Omelet

ఆమ్లేట్ ఇవ్వడం లేదని అరియానా, అమ్మ రాజశేఖర్ గొడవ పెట్టుకున్నారు. అరియానా అయితే గత టాస్కులు విషయానికి వెళ్లి అభిజిత్‌ను పాయింట్ అవుట్ చేసింది. మీరెప్పుడూ ఇంతే ఫుడ్ దగ్గరే ఆటను ఆపేస్తారు.. ఎప్పుడూ ఫుడ్ సరిగ్గా ఇవ్వరు ఆని అరిచింది. దానికి బదులుగా అభిజిత్ అరియానాపై విరుచుకుపడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఫుడ్ గురించి మెయిన్‌గా ఉంది కావాలంటే వెళ్లి చూసుకో తెలియకపోతే మూసుకో అని అరిచేశాడు.

అయితే అమ్లేట్‌కు పెట్టిన ధాన్యం క్వాంటిటీ ఎక్కువగా ఉండటంతో అందరూ నిరుత్సాహపడ్డారు. రెండు దోసిళ్ల నిండా ధాన్యం ఇచ్చినా కూడా ఆమ్లేట్ ఇవ్వకపోవడంతో అమ్మ రాజశేఖర్ హర్ట్ అయ్యాడు. కోపంలో మోనాల్ చేతిలో ఉన్న ఆహారాన్ని పడేశాడు. తినే అన్నాన్ని ఎవరైనా అలా చేస్తారా? అంటూ అభిజిమ్ అమ్మ రాజశేఖర్‌పై ఫైర్ అయ్యాడు. మొత్తానికి ఆమ్లేట్ పెట్టిన మంట మాత్రం కాస్త గట్టిగానే తగిలింది.