బిగ్‌బాస్ షోలో గంగవ్వ ఎలా బయటకు వెళ్లిందో అందరికీ తెలిసిందే. గంగవ్వకు ఆరోగ్యంగా బాగా లేకపోవడంతో తప్పని పరిస్థితిలో బయటకు పంపాల్సి వచ్చింది. మొదటి రెండు వారాల్లోనే గంగవ్వ ఆరోగ్యం దెబ్బతింది. బిగ్ బాస్ ధైర్యం చెప్పి, వైద్యం అందించిన ఇంట్లోనే ఉంచేలా చేశాడు. కానీ ఐదో వారంలో మాత్రం గంగవ్వ బతిమిలాడగానే పంపించారు. వారం మొత్తం గంగవ్వకు బాగాలేదని చెప్పి పంపించారు.
కొందరేమో గంగవ్వను కావాలనే పంపించారని అంటారు. కాసేపు ఆ విషయం పక్కన పెడితే నోయల్ సంగతేంటో ఓ సారి చూద్దాం. వచ్చిన మొదటి వారంలో కాస్త హైపర్‌గానే ఉన్నాడు. ఇంట్లో లీడ్ తీసుకుని గ్యాంగ్ లీడర్‌గా మారాడు. కానీ రెండో వారం నుంచి ఇప్పటి వరకు చడీ చప్పుడు లేకుండా అయిపోయాడు. అందులోనూ నోయల్‌గా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉండటం, ఎప్పుడూ కీళ్ల నొప్పులు ఉండటంతో ఫిజికల్ టాస్కులు ఆడేంత శక్తి కూడా లేకపోవడంతో సైలెంట్‌గా ఉండిపోయాడు.
ఏసీలో ఉంటే మరీ ఆ సమస్యలు ఎక్కువవుతాయట నోయల్‌కు. అందుకే అందరిలా బెడ్ రూంలో కాకుండా బయటకు వచ్చి పడుకుంటాడు. అయితే ఈ సమస్యలు ఎక్కువ అవుతుండటంతో బిగ్ బాస్ బయటకు పంపించాడు. మెరుగైన వైద్యం అందించాలి అందుకే బయటకు పంపేస్తున్నానని తెలిపాడు. అయితే త్వరగా కోలుకుని మళ్లీ ఇంట్లోకి వస్తారని, రావాలని ఆశిస్తున్నట్టు బిగ్ బాస్ తెలిపాడు. మరి నోయల్ మళ్లీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.