బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలున్నట్టున్నాయ్. గంగవ్వకు వయసు ఎక్కువ, ఊరి నుంచి వచ్చింది.. ఈ వాతావరణం పడకపోవచ్చు.. అందులో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బాగానే ఓర్చుకుంది కానీ చివరకు ఐదో వారంలో బయటకు రాక తప్పలేదు. ఇక తన వల్ల కాదు బయటకు పంపించేయండి మొర్రో అని మొత్తుకోవడంతో గంగవ్వను ఆట మధ్యలోనుంచే పంపించేశారు. అయితే ఈ క్రమంలో నోయల్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
నోయల్ ఫిజికల్ టాస్కులో పాల్గొనడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అతనికి ఆర్థరైటిస్ సమస్యలున్నాయట. అందుకే ఇంట్లో కూడా కాలు నొప్పి చేతి నొప్పి అంటూ రోజూ మూలకే ఉంటాడు. పైగా ఏసీలో ఉంటే ఆ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయని బెడ్రూంలో కాకుండా బయట పడుకుంటున్నాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం నోయల్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు కనిపిస్తోంది.
నోయల్‌కు భుజం, కాళ్లు, చేతులు ఎక్కువగా నొప్పి పెడుతూ ఉండటంతో డే కేర్ సెంటర్ టాస్క్‌కు విరామం ఇచ్చేశాడు. డాక్లర్లు కూడా పరీక్షించారట. బిగ్ బాస్ ఈ మేరకు నోయల్‌కు టాస్క్‌నుంచి విముక్తిని కలిగించాడు. నోయల్‌కు బదులు అభిజిత్ కేర్ టేకర్‌గా మారి అవినాష్‌ను చూసుకున్నాడు. నోయల్‌కు అభిజిత్ కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుందని అనిపిస్తే వెళ్లు అని చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ సమస్య తీరకపోతే గంగవ్వలా నోయల్ బయటకు వస్తాడేమోనని బయట టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.