Bigg Boss 4 Telugu.. ఎలిమినేట్ అయింది ఆమెనే.. సమంత ఏమైనా మాయ చేస్తుందా?

Bigg Boss 4 Telugu week 7 Is Divi Vadthya Eliminated

బిగ్ బాస్ ఏడో వారంలో నామినేషన్ ప్రక్రియ వింతగా జరిగింది. శత్రువుల్లా ఫీలయ్యే వారిని గిట్టని వారిని బిగ్ బాస్ ఓ జట్టుగా చేశాడు. ఫెవికాల్‌లా అతుక్కుపోయి ఉండే వారిని ఓ జట్టుగా చేశాడు. అఖిల్ మోనాల్, అభిజిత్ హారిక, అవినాష్ సోహెల్, అరియానా మెహబూబ్, దివి లాస్యలను జట్టుగా చేశాడు. ఇందులోనే ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలి. ఇంకొకరు సేవ్ అవ్వాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. కొందరు చర్చలు, వాదోపవాదాలు జరిపారు.

చివరకు మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా, దివి నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ డీల్ వల్ల ఆల్రెడీ నామినేట్ అయి ఉన్నాడు. ఇలా ఏడో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఆరుగురు నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం మాత్రం ఎలిమినేషన్ ఉండదు.. దసరా స్పెషల్.. నో ఎలిమినేషన్ అంటూ ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే మళ్లీ నిన్న రాత్రి నుంచి ఎలిమినేషన్ గురించి కొత్త వార్తలు వచ్చాయి.

మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా, దివి నామినేట్ అయ్యారు
మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా, దివి నామినేట్ అయ్యారు

దివి ఎలిమినేట్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ సమంత ఏదైనా మాయ చేసేలానే కనిపిస్తోంది. ఎందుకంటే పండుగ పూట ఎవ్వరినీ ఏడిపించాలని ఎవ్వరూ కోరుకోరు. అలా దివిని బయటకు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి.. సీక్రెట్ రూంలోకి పంపిస్తారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఏది నిజమో చూడాలంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే దసరా స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్‌ను చూడాలి.

Bigg Boss 4 Telugu week 7 Is Divi Vadthya Eliminated
Bigg Boss 4 Telugu week 7 Is Divi Vadthya Eliminated