బిగ్‌బాస్‌లో పడవ ప్రయాణం.. ఎవరిని ముంచుతుందో మరి!!

bigg boss 4 telugu week 2 nomination process

బిగ్‌బాస్ షో రెండో వారంలోకి అడుగుపెట్టింది. నేడు సోమవారం కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ఘట్టం షురూ అవుతుంది. ఇక రెండో వారానికి గానూ వెరైటీగా నామినేషన్ టాస్క్‌ను సెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సారి మాత్రం ఎవరికి వారే డిసైడ్ కావాలనే నిబంధనను పెట్టినట్టు తెలుస్తోంది. ఎదుటి వారిని నామినేట్ చేయాలనే తిరకాసు పెట్టినట్టు కనిపించడం లేదు.

నేటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా గార్గెన్ ఏరియాలో ఓ పడవను ఏర్పాటు చేశాడు. మొదటగా అందరూ ఆ పడవలో ప్రయాణించాలి. అయితే తీరం చేరాక ఓ గంట మోగుతుందని, అలా మోగిన ప్రతీ సారి ఎవరో ఒకరు దిగిపోవాలనే మెలిక పెట్టాడు. అలా దిగిన వారు రెండో వారంలో నామినేట్ అయినట్టు లెక్క అని తెలిపాడు. ఇక చూస్తుంటే నేడు ఇంటి సభ్యుల మధ్యలో బాగానే డిస్కషన్ వచ్చేట్టు కనిపిస్తోంది.

bigg boss 4 telugu week 2 nomination process
bigg boss 4 telugu week 2 nomination process

ఇక వేళ ముందుగా తమంతట తామే దిగుతామని నిర్ణయించుకుంటే ఓవర్ కాన్ఫిడెంట్ అని అనుకుంటున్నారు. అలా అని ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతే.. సేఫ్ గేమ్ అనే బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి కంటెస్టెంట్లందరూ ఏం చేస్తారో చూడాలి. ఎవరు నామినేట్ అవుతారు? ఎవరు తప్పించుకుంటారో చూడాలి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోను బట్టి చూస్తే నోయల్, గంగవ్వ నామినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.