బిగ్ బాస్ షో, హోస్ట్‌లను ఒక్కోసారి నెటిజన్లను ఏకిపారేస్తాడు. అసలు అక్కడ బిగ్ బాస్ అనే వ్యక్తే ఉండదు. బిగ్ బాస్ టీం అంటూ ఒకటి ఉంటుంది. ఏ కంటెస్టెంట్‌ను ఎలా లేపాలి.. ఏ కంటెస్టెంట్‌ను ఎలా డీగ్రేడ్ చేయాలి.. హోస్ట్ ఏం మాట్లాడాలి.. ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలి.. ఆ రోజు ఎపిసోడ్‌ను ఎలా పైకి లేపాలి ఇలా అన్నీ చూసేందుకు బిగ్ బాస్ టీం ఉంటుంది. అయితే ప్రతీ సారి బిగ్ బాస్ టీం ముంబై నుంచి వస్తుంది. కానీ ఈ సారి మాత్రం వాళ్లు బిజీగా ఉండటంతో లోకల్ టీంకు అప్పగించారట.
దాంతో మొదటి నుంచి బిగ్ బాస్ షో గాడితప్పింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున అభిజిత్, హారికలను మాత్రమే టార్గెట్ చేశాడు. అయితే ఇందులో నాగార్జున చేసేదేమీ ఉండదు. ఆయనకు స్క్రిప్ట్ ఎలా ఇస్తే అలా చదివేసి, యాక్ట్ చేసేసి వెళ్లిపోతాడు. నాగార్జునను ఆడించేది కూడా తెర వెనుకుండే బిగ్ బాస్ టీం. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో అభిజిత్, హారికలను దారుణంగా అవమానించారు. ఇక ఈ ఇద్దరు కంటెస్టెంట్లే తప్పులు చేశారన్నట్టుగా వీడియోలు ప్లే చేసి పరువుతీశాడు నాగార్జున.
అభిజిత్‌ను దారుణంగా టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. నాగార్జునను, బిగ్ బాస్ టీంను అభిజిత్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసి పడేశారు. అభిజిత్ ఫ్యాన్స్ దెబ్బకు అతని పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. #StopTargetingAbijeet అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిజిత్ ఫ్యాన్స్ చేసిన ట్వీట్ల యుద్దానికి నిన్న నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అయింది. అభిజిత్ హారికలను విడగొట్టేందుకు, అభిజిత్‌ను మానసికంగా ఇంకా కృంగదీసేందుకు అలా టార్గెట్ చేశారని నాగార్జునను ఏకిపారేశారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. కొందరు మాత్రం నాగార్జున అడిగిన ప్రశ్నలు కరెక్ట్ అంటూ మద్దతు తెలుపుతున్నారు.