బిగ్ బాస్ షోలోకి వచ్చి ఏం నేర్చుకున్నారు.. షోలోకి రాకముందు వచ్చాక ఏం మార్పు వచ్చిందో చెప్పమని మొన్నామధ్య ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో భాగంగా సోహెల్ కొన్ని విషయాలను చెప్పాడు. ఇంట్లోకి వచ్చాక అన్నం విలువ ఏంటో తెలుసుకున్నాను.. మనుషుల విలువ ఏంటో తెలిసి వచ్చింది.. ఒకప్పుడు నేను సెల్ ఫోన్లతోనే ఉండేవాడిని. పక్కన మనుషులు ఉన్నా కూడా పట్టించుకునే వాడిని కాదు. సొంత తమ్ముడు పక్కన ఉన్నా కూడా మాట్లాడే వాడిని కాదని సోహెల్ చెప్పుకొచ్చాడు.
అయితే ఇదే విషయంపై నిన్న సోహెల్ సోదరసమానుడైన రామా రావు అనే వ్యక్తి అసలు గుట్టు విప్పాడు. ఖార్ఖానాలో రాత్రి తొమ్మిది దాటితే సోహెల్ ఎలా ప్రవర్తిస్తాడు.. ఎలాంటి వ్యక్తి అనే విషయాలను చెప్పి పరువుతీసేశాడు. రాత్రి తొమ్మిది దాటితే కథ వేరే ఉంటదని, అందరం కూర్చుని ఉంటాం.. కానీ సోహెల్ మాత్రం తన ఫోన్‌లో చాటింగ్‌తో బిజీగా ఉంటాడు. తొమ్మిందింటికి మొదలుపెడితే.. ఒంటి గంట అయినా కూడా వదిలిపెట్టడని చెప్పుకొచ్చాడు.
వరుసగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తాడని, ఒకరు అయిన వెంటనే మరొకరితో మాట్లాడుతూనే ఉంటాడని అసలు విషయం చెప్పేశాడు. దీంతో తన గుట్టు బయటపడటంతో తల పట్టుకున్నాడు. వారంతా ఫ్రెండ్స్ సర్ అని నాగార్జునతో మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. సోహెల్ నిజస్వరూపం తెలిసిందా.. అసలు ఇలాంటి వాడేనని ఊహించారా? అని ఇంటి సభ్యులను మళ్లీ రెచ్చగొట్టాడు. మొత్తానికి సోహెల్ మాత్రం మంచి రసికుడేనని నెటిజన్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు.