బిగ్‌బాస్ నాల్గో సీజన్ నిన్న (సెప్టెంబర్ 6) సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మోనాల్ గజ్జర్, సూర్యకిరణ్, లాస్య, అభిజీత్, సుజాత, దేవీ నాగవల్లి, దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్, ఆరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయల్, దివి, అఖిల్ సార్థక్, గంగవ్వ ఇలా పదహారు మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఇక ఇందులో ఇద్దరిని నైబర్ రూం మొదట్లో ఓ సీక్రెట్ రూంలో పెట్టి ఆట స్ట్రాటజీని మొదలుపెట్టాడు. నాల్గో కంటెస్టెంట్లు, వాటిపై వస్తోన్న ట్రోల్స్, మీమ్స్, బిగ్‌బాస్ టీం సెలెక్షన్‌పై వస్తోన్న కామెంట్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వీటన్నంటినీ కాసేపు పక్కనపెడితే.. కంటెస్టెంట్ల కథ, వ్యథలు మాత్రమే అందరినీ కదిలించాయి.
అందులో మరీ ముఖ్యంగా దేవీ నాగవల్లి. తెలుగు జర్నలిజంలో ఈమె పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. మీమ్స్ క్రియేటర్స్, ట్రోలింగ్ బ్యాచ్‌కు ఈమె మరింత సుపరిచితురాలు. నెగెటివ్‌గానో, పాజిటివ్‌గానో దేవీ నాగవల్లి చాలా పాపులర్. సోషల్ మీడియాలో ఈమె ఇంటర్వ్యూల్లో, బయట ఈమె చేసే అతి, వస్త్రాధారణ, ఆహార్యంపై వింత వింత కామెంట్లు వస్తుంటాయి. కానీ ఇదంతా ఒకసైడ్. ఆమెలోని ఓ కొత్త కోణాన్ని, ఎవ్వరికీ తెలియన విషయాలను నిన్న బిగ్ బాస్ ద్వారా అందరికీ పరిచయం చేసింది.
అనుకోకుండా ఈ రంగానికి వచ్చానని, గ్రాఫిక్ కోర్స్‌లో శిక్షణ తీసుకుంటే.. యాంకర్‌గానూ అవకాశం వచ్చిందని తెలిపింది. తనది పెద్దలు కుదిర్చిన వివాహం, అమెరికాలో కొన్ని రోజలున్నానని, కానీ ఎక్కువ రోజులు కలిసి ఉండలేదని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నానని వ్యక్తిగత జీవితంలోని చేదు సంఘటనల గురించి తెలిపింది. ప్రస్తుతం తనకు ఆరేళ్ల బాబు ఉన్నాడని చెప్పుకొచ్చింది.
తాను ఎంతో మందిని చూశానని, అంత డబ్బు ఎలా సంపాదిస్తారా? అని ఆలోచించేదాన్ని అంత డబ్బు నాకుంటునే అంటూ సంబరపడిపోయింది. ప్రతీ నెల పదో తారీఖునే డబ్బులు అయిపోతాయ్.. ఎన్నో బాధ్యతలున్నాయ్.. హోం లోన్ ఈఎంఐలున్నాయని తన బాధనంతా చెప్పుకుంది. కేవలం డబ్బు సంపాదించడం కోసమే బిగ్‌బాస్‌కు వచ్చానని నిర్మోహమాటంగా తెలిపింది. ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న నెగెటివిటీని దాటుకున్ని చివరి వరకు నిలబడి డబ్బును గెలుచుకుంటుందా లేదో చూద్దాం.