ఎర్రిపప్ప అయ్యాడోచ్.. పరుపుదీసుకున్న నోయల్

సింగర్, నటుడు అయిన నోయల్ మంచి స్ట్రాటజీతోనే గేమ్‌లోకి వచ్చాడు. అంతా అనుకున్నట్టు, చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. ఎగ్జామ్ పేపర్ లీక్ అయి.. ఫుల్లుగా చదివి వెళ్తే తీరా అక్కడ వేరే పేపర్ వస్తే ఎలా ఉంటుందో నోయల్ పరిస్థితి అలానే ఉంది.య కట్టప్ప అంటూ లేని క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి అందరిలోనూ ఓ గందరగోళాన్ని క్రియేట్ చేశాడు. ఇక మొదటి వారం ఈ కట్టప్ప చుట్టే తిరిగింది.

నిన్న మరీ ఘోరంగా మళ్లీ మూడోసారి కట్టప్ప చర్చను తీసుకొచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటికీ చిటీల మీద రాశారు.. సోహెల్, ఆరియానాలకు వివరించారు. మళ్లీ నిన్న ముద్రలు వేసి చెప్పాలని తెలిపాడు. ఈ క్రమంలో అందరూ వేరే వారి పేరు, కారణాలు చెప్పి మొహం మీద ముద్రలు గుద్దారు. ఈ క్రమంలో లాస్య, నోయల్‌కు ఎక్కువ వచ్చాయి.

 

అయితే నోయల్ వంతు వచ్చినప్పుడు మాత్రం కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. ముద్ర వేస్తే ఇంట్లో వాళ్లు ఫీల్ అవుతారు అంటూ ఏదేదో సింపతీ డైలాగ్స్ కొట్టాడు. అందుకే ఎవర్నీ నొప్పించకుండా తనది తానే ముద్ర వేసుకున్నాడు. అలా కుదరదు అది తప్పు అని వారించినా నోయల్ వినలేదు. చివరకు బిగ్‌బాస్ అది చెల్లదని ప్రకటించేసరికి నోయల్ పరువుపోయింది. ఇక హౌస్‌మేట్స్ సైతం ఫక్కున నవ్వేశారు. సోషల్ మీడియాలో నోయల్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.