సమంతను భలే ఇరుకున పెట్టాడే.. కార్తికేయ మామూలోడు కాదు!

Bigg Boss 4 Telugu Karthikeya Requested Samantha To Act With Him

సమంత నటన గురించి అందం గురించి ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. టాలీవుడ్‌కు కాదు ఏకంగా సౌత్ మొత్తానికి సూపర్ స్టార్ అని నిరూపించుకుంది. టాలీవుడ్ కోలీవుడ్‌లో సమంత స్టార్డం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సమంత తమ సినిమాలో తీసుకోవాలంటే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. లేదా అది లేడీ ఓరియెంటెడ్ చిత్రమై ఉండాల్సి ఉంటుంది. అలా అయితే గానీ సమంతను ఇప్పుడు తెరపై చూడలేం.

ఒకప్పటిలా గ్లామర్ డాల్ క్యారెక్టర్స్‌ను పోషించేందుకు సమంత రెడీగా లేదు. అయితే ఇవన్నీ తెలిసి హీరో కార్తికేయ ధైర్యం చేసి ఓ అడుగు ముందుకు వేశాడు. నిన్నటి బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో కార్తికేయ డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. అయితే దివి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. పండుగ కాబట్టి ఆమెను స్పెషల్‌గా స్వాగతిద్దామని కార్తికేయను తీసుకురమ్మానని సమంత చెప్పింది.

Bigg Boss 4 Telugu Karthikeya Requested Samantha To Act With Him
Bigg Boss 4 Telugu Karthikeya Requested Samantha To Act With Him

ఇక స్టేజ్ మీదకు వచ్చిన దివికి సమంత అదిరిపోయే ఆఫర్ ఇప్పించింది. హీరోగా కార్తికేయ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే దివి తన సినిమాలో పెట్టుకోవాలని కార్తికేయను సమంత రిక్వెస్ట్ చేసింది. దానికి కార్తికేయ కూడా ఓకే అన్నాడు. అయితే కార్తికేయ ఇక్కడే ఓ ఫిట్టింగ్ పెట్టాడు. సమంతను ఇరుకున పెడుతూ.. మీరు కుడా నాతో యాక్ట్ చేయాలని కార్తికేయ మాట తీసుకున్నాడు. సమంత కూడా ఏం చెప్పాలో అర్థం కాక…కాస్త గ్యాప్ తీసుకుని ఓకే అనేసింది. కానీ అది జరిగే పని కాదని అందరికీ తెలిసిందే. చూద్దాం మరి భవిష్యత్‌లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో.

Bigg Boss 4 Telugu Karthikeya Requested Samantha To Act With Him
Bigg Boss 4 Telugu Karthikeya Requested Samantha To Act With Him