మళ్లీ ప్రేక్షకుల మనసు దోచేసింది.. అభిజిత్ తల్లి మాటలకు అందరూ ఫిదా!!

బిగ్ బాస్ టైటిల్ గెలిచాడంటే ఏ తల్లికైనా ఎంతటి గర్వం ఉండాలి.. ఉంటుంది కూడా. కానీ ఆ గర్వాన్ని ఎక్కడా వీసమెత్తు కూడా చూపించలేదు. కొడుకు టైటిల్ గెలిచాడన్న సంతోషాన్ని మాత్రం మొహంలో కాసింత చూపించింది. అయితే కొడుకు గెలిచాడు కదా అని పక్కన రన్నర్‌గా ఉన్న అఖిల్‌ను అభిజిత్ తల్లి లక్ష్మీ వదిలేయలేదు. అఖిల్‌ను కూడా అభిజిత్‌తో సమానంగా చూసింది. అక్కడే తల్లి మనసు ఏంటో చూపించింది. వందకు వెయ్యి మార్కులు కొట్టేసింది. ట్రోఫీ అందుకున్న తరువాత అభిజిత్ తల్లి మాట్లాడింది.

Bigg Boss 4 Telugu Finale Abhijeet Mother Gets Attracted
Bigg Boss 4 Telugu Finale abhijeet Mother Gets Attracted

అభిజిత్ అఖిల్ మీ ఇద్దరి (చిరు, నాగ్) మధ్య ఇలా ఉండటంతో ఎంతో సంతోషంగా ఉంది.. ఆ ఇద్దరు మీ ఇద్దరిలా ఎదగాలని ఆశీర్వాదాలు ఇవ్వండని లక్ష్మీ కోరారు. ఆ మాటలకు అభిజిత్.. అది ఎప్పటికీ జరగదు అమ్మ అని చెప్పాడు. అలా అనకూడదు పాజిటివ్‌గా ఆలోచిస్తేనే మంచి జరుగుతుంది.. అది ఎప్పటికైనా మంచే జరుగుతుందని లక్ష్మీ చెప్పుకొచ్చారు. ఆ మాటలకు చిరు స్పందిస్తూ… అవును ఏదైనా సాధించగలమన్న నమ్మకం ఉండాలి.. దాంతోనే ముందుకు వెళ్లాలి… అన్నాడు.

అయితే అలా అభిజిత్ గెలిచినా కూడా అఖిల్‌ను పక్కన పెట్టకపోవడం, మిగిలిన కంటెస్టెంట్లు కూడా కష్టపడ్డారు.. వారు కూడా విజేజతలే… అందరూ విజేతలే అంటూ కలుపుకుపోయారు. అక్కడే ఆమె అందరి మనసులను దోచారు. ఇలా అభిజిత్ కంటే అతని తల్లే ఎక్కువ మార్కులు కొట్టేసింది. మొత్తానికి ఫినాలేఎపిసోడ్‌లొ రన్నర్, విన్నర్ కంటే మిగతా వారంతా ఫేమస్ అయ్యారు. మిగతా వారికే ఆఫర్లు, ప్రశంసలు లభించాయి. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles