బిగ్‌బాస్ నాల్గో సీజన్ రోజు రోజుకూ పుంజుకుంటోంది. ముందుకు సాగుతున్న కొద్దీ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే మారుతోంది. ఫస్ట్ వీకెండ్‌లో నాగార్జున వచ్చి బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగ్ ఓ మోస్తరుగా అందర్నీ ఆడించాడు. అయితే ఆటపాటల్లో మాత్రం ఆదివారం నాటి ఎపిసోడ్ దుమ్ములేచిపోనున్నట్టు కనిపిస్తోంది. ఈ సండే ఫండేలా మారబోతోన్నట్టు తెలుస్తోంది. దేవీ నాగవల్లిలోని కొత్త యాంగిల్‌ను నేడు మనం చూడబోతోన్నాం.

Bigg Boss 4 Telugu Devi Nagavalli Dance Performance In Weekend Episode
దేవీ నాగవల్లి అంత యాక్టివ్, ఎంటర్టైనింగ్‌గా ఏమీ ఉండటం లేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తుంది. తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. ఇక పరిస్థితులను విశ్లేషించడంలో తనకు తానే సాటి. బిగ్‌బాస్ హౌస్‌లో అసలు కట్టప్ప అనే వారే లేరని ముందే పసిగట్టింది దేవీ. అలాంటి దేవీ నాగవల్లి తన విశ్వరూపాన్ని చూపెట్టింది. నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరితో స్టెప్పులు వేయించినట్టు కనిపిస్తోంది.

Bigg Boss 4 Telugu Devi Nagavalli Dance Performance In Weekend Episode
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో దేవీ నాగవల్లి దుమ్ములేపింది. జంటలుగా వచ్చి పాటలకు డ్యాన్సులు వేయాలని నాగ్ టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ముందుగా దేవీతో డ్యాన్స్ చేయడానికి మగ కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా ధైర్యం చేయనట్టు కనిపిస్తోంది. ఆ తరువాత అభిజీత్ ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇక డీజే సినిమాలో సీటీమార్ పాటకు దేవీ వేసిన మాస్ స్టెప్పులు అదరహో అనేట్టు ఉన్నాయి. ప్రోమోలోనే ఇలా ఉందంటే పూర్తిగా దేవీ డ్యాన్స్ చూస్తే ఇంకెలా ఉంటుందో అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.