బిగ్ బాస్ ఇళ్లంతా అల్లకల్లోలమయ్యేలా కనిపిస్తోంది. నేటి ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్ కెప్టెన్‌గా ఎన్నికైనట్టు కనిపిస్తున్నాడు. ఇంట్లొ తొమ్మిదో వారానికి గానూ రింగులో రంగు అనే టాస్క్ పెట్టాడు. అందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు. చివరకు ఆ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ గెలుపొందినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ అయ్యాక అమ్మ రాజశేఖర్ అసలు రంగు బయటకు వచ్చినట్టుంది. ఎవరికైనా అధికారం రాకముందు ఒకలా అధికారం వచ్చాక ఒకలా ప్రవర్తిస్తుంటారు.
అమ్మ రాజశేఖర్ కూడా అదే చేసినట్టు కనిపిస్తాడు. బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అనేవాడు అందరికీ సమ న్యాయం చేయాలి. పనులు అందరి చేత చేయించాలి.. ఒకరిపైనే ఎక్కువ భారం వేయకూడదు. తనకు నచ్చిన వారు, తన గూటి వాళ్లను ఎక్కువగా కష్టపెట్టకుండా మిగతా వారి మీద మొత్తం పని భారం వేయకూడదు. కానీ మాస్టర్ మాత్రం అదే పని చేసినట్టు కనిపిస్తోంది. అవినాష్, అరియానా, మెహబూబ్‌లకు ఎక్కువగా పని కేటాయించనట్టు కనిపిస్తోంది.
పైగా అభిజిత్ హారిక లాస్య అఖిల్ గ్రూపుకు మాత్రం పని ఇష్టం లేకపోయినా కేటాయించినట్టు కనిపిస్తోంది. అది మేం చేయమని వీరు కూడా భీష్మించుకుని కూర్చున్నారు. ఇది నా కెప్టెన్సీ నా ఇష్టం అన్నట్టుగా అమ్మ రాజశేఖర్ మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే మాస్టర్ అసలు రంగులు బయటకు వస్తున్నాయి. అయినా మాస్టర్‌ది మూన్నాళ్ల ముచ్చటయ్యేలానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకున్న ఓటింగ్ సరళి ప్రకారం అమ్మ రాజశేఖర్ తొమ్మిదో వారంలో ఎలిమినేట్ కాబోతోన్నాడని తెలుస్తోంది.