Home Entertainment Bigg Boss 4 Telugu : బోల్డ్ పాప భోరున ఏడ్చింది..అరియానా అతి మామూలుగా లేదు!!

Bigg Boss 4 Telugu : బోల్డ్ పాప భోరున ఏడ్చింది..అరియానా అతి మామూలుగా లేదు!!

బిగ్ బాస్ షో ప్రారంభం రోజు అరియానా ఎలా ఎంట్రీ ఇచ్చిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఐదు నిమిషాల ఇంట్రడక్షన్ ప్రోమోలో ఓ యాభై సార్లు బోల్డ్ అని చెప్పుకున్నట్టుంది. అసలు బోల్డ్ అంటే ఏమిటో కూడా అరియానాకు తెలుసో లేదో కానీ బోల్డ్ అంటూ తనకు తాను ట్యాగ్ ఇచ్చుకుంది. సరే అదంతా వదిలేద్దాం. తన గురించి తాను ఇష్టమొచ్చినట్టుగా చెప్పుకుంటుంది. దాదాపు తొమ్మిది వారాలుగా జనాలు ఆమెను భరిస్తూనే వస్తున్నారు. ఆమె ఏంటో, ఆమె వ్యవహారం ఏంటో అరియానా నుంచి అతియానాగా ఎలా మారిందో అందరం చూస్తూనే ఉన్నాం.

Bigg Boss 4 Telugu Ariyana Cried For Amma Rajasekhar
Bigg Boss 4 Telugu Ariyana Cried for Amma Rajasekhar

అరియానా మొదటగా షోలోకి ఎంట్రీ ఇచ్చాక సోహెల్‌తో పాటు నైబర్ రూంలో ఉండిపోయింది. ఓ రెండు రోజులు వారిద్దరూ ఒకే రూంలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదో ట్రాక్ మొదలవుతుందని అందరూ భావించారు. కానీ అరియానాకు ఉన్న అతి, ఓవర్ యాక్షన్, యాటిట్యూడ్‌తో సోహెల్ దూరంగానే ఉండిపోయాడు. మధ్యలో అరియానాను కరెక్ట్ చేయాలని చూస్తే.. నీకెందుకు నా ఆట నేను ఆడకుంటాను అంటూ సోహెల్‌కు కాస్త గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

తరువాత అవినాష్‌తో అరియానా క్లోజ్‌గా ఉండటం ప్రారంభించింది. దివి ఎలిమినేట్ అయ్యాక అమ్మ రాజశేఖర్‌తో క్లోజ్ అయింది. ఇక ఈ ముగ్గురు ఓ గ్యాంగ్‌లా మారారు. అయితే అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్‌ను అరియానా తట్టుకోలేకపోయింది. కెమెరాల ముందుకు వచ్చి భోరున ఏడ్చింది. ఇక ఈ ఇంట్లో నేను ఉండలేను.. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను.. నేను బోల్డ్ అనుకున్నాను..కానీ కాదు.. ఆ ట్యాగ్ మీరే తీసుకోండి బిగ్ బాస్.. నన్ను పంపించేయండి అని భోరున ఏడ్చింది. అమ్మ రాజశేఖర్‌ను పంపించారు.. నన్ను కూడా పంపించండి అంటూ విలపించింది. కానీ ఉదయానికి అంతా సెట్ అయిపోయి.. మార్నింగ్ పాటకు దుమ్ములేచేలా డ్యాన్స్ చేసింది.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News