Home TV SHOWS Bigg Boss 4.. ప్రేమలో ఉన్న అరియానా.. మొత్తానికి అలా బయటపడింది!

Bigg Boss 4.. ప్రేమలో ఉన్న అరియానా.. మొత్తానికి అలా బయటపడింది!

బిగ్‌బాస్ షోలో అరియానా చేసే సందడి అందరికీ తెలిసిందే. కావాలని చేస్తుందో లేదా సహజంగానే అలా ఉంటుందో సగటు ప్రేక్షకునికి అర్థం కాదు. ఒక్కోసారి పుటేజ్ కోసం అతి చేస్తుందని అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు ఆమె ఆడే ఆటలు, మాట్లాడే మాటల్లో నిజాయితీ, ముక్కుసూటిదనం కనిపిస్తూ ఉంటుంది. ఇలా అరియానా ఓ డిఫరెంట్ ముద్రను వేసుకుంటోంది. అయితే నిన్నటి దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో మాత్రం అరియానా ఓ విషయాన్ని బయటపెట్టేసింది.

అరియానా బిగ్ బాస్ ఇంట్లో అవినాష్‌తో బాగా క్లోజ్ అయింది. మొదట్లో నైబర్ రూంలో ఉన్నప్పుడు సోహెల్‌తో క్లోజ్‌గా ఉండేది. కానీ రాను రాను అవినాష్‌కు దగ్గరైంది. ఈ జోడికి నాగార్జున కూడా దగ్గరుండి మరీ ఉప్పందిస్తున్నాడు. ఏమీ లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసేందుకు తాపత్రయపడుతున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అవినాష్‌తో ఉన్న రిలేషన్ బయటపెట్టేసింది. అవినాష్ తనకు ఫ్రెండ్‌ మాత్రమేనని చెప్పేసింది.

Bigg Boss 4 Telugu Ariyana About Her Lover
Bigg Boss 4 Telugu Ariyana About Her Lover

బయటకు వచ్చాక కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండేనని అరియానా క్లారిటీ ఇచ్చింది. అంతేనా వేరే ఏది లేదా? అని హోస్ట్ సమంత అడగ్గా వేరే దానికి వేరే వాళ్లున్నారు అంటూ బాంబ్ పేల్చింది. అయితే అంతకు ముందు అరియానా తన ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఎమోషనల్ అయింది. వినీత్ అనే అబ్బాయి గురించి చెప్పింది. అతడు గుర్తొచ్చి.. ఏడ్చేశానని చెప్పేసింది. ఆ తరువాత తనకు వేరే వాళ్లున్నారని చెప్పింది. చూస్తుంటే అరియానా ఫియాన్సి వినీత్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఓ క్లారిటీ అయితే వచ్చింది. అరియానా అవినాష్‌తో క్లోజ్‌గా ఉన్నా, అభిజిత్‌ను వాటేసుకుంటున్నా అది షో వరకు మాత్రమే.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News