బిగ్ బాస్ షోలో అమ్మ రాజశేఖర్ తొమ్మిది వారానికి గానూ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన అమ్మ రాజశేఖర్ అదృష్టం కలిసి వచ్చి బతికిపోయాడు. మొత్తానికి అమ్మ రాజశేఖర్‌కు బిగ్ బాస్ ఇంటితో రుణం తీరిపోయింది. వెళ్తూ వెళ్తూ అభిజిత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి వెళ్లిపోయాడు. అసలు మనిషి, నకిలీ మనిషి అంటూ టాస్క్ పెట్టిన నాగార్జున.. అమ్మ రాజశేఖర్ ఊహించినట్టుగానే చేశాడు. అభిజిత్ అఖిల్‌ను నకిలీ అంటాడని అందరూ ఊహించిందే.
అయితే రాహుల్ సిప్లిగంజ్‌తో చేస్తోన్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అభిజిత్ గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. అభిజిత్ షోలో ఉండి వేస్ట్.. అతడి వల్ల ఏమీ కాదు.. కనీసం నేను ఉంటే టీఆర్పీ అయినా వస్తుంది అంటూ అమ్మ రాజశేఖర్ ఘోరమైన కామెంట్లు చేశాడు. అయితే అమ్మ రాజశేఖర్ అభిజిత్ మధ్య వైరం ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అమ్మ రాజశేఖర్ తనకు నచ్చితే మంచి వాడని నెత్తిన పెట్టుకుంటాడు.. నచ్చక పోతే పాతాళానికి తొక్కేస్తాడు.
ఎన్నోసార్లు అభిజిత్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అయితే అభిజిత్ కూడా కొన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇంట్లో ఎక్కువగా పని చేయకుండా ఉల్లిపాయలు తరుముకుంటూ ఉంటాడు. లేదా సోఫాలో కూర్చుని ముచ్చట్లు పెడుతుంటాడు. ఫిజికల్ టాస్కుల్లో వీక్. ఇవే విషయాలను వెలేత్తి చూపుతూ ప్రతీసారి అభిజిత్‌ను కించపరుస్తుంటాడు అమ్మ రాజశేఖర్. వెళ్లేముందు కూడా ఇవే విషయాలను చెప్పి వెళ్లాడు.