బిగ్ బాస్ 4 : రేపటి నుంచే స్టార్ట్ .. చివరాఖరి కంటెస్టంట్ లు వీళ్ళే

Bigg boss 4 final contestants list revealed

1..2…3.. రెడీ.. బిగ్ బాస్ షోకు అంతా సిద్ధమయిపోయింది. ఇంకా ఒక్క రోజే సమయం. సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నది.

Bigg boss 4 final contestants list revealed
Bigg boss 4 final contestants list revealed

అంతా ఓకే అయినట్టే ఇక. నిజానికి కంటెస్టెంట్లను ఎప్పుడో తమవద్దకు రప్పించుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు.. వాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచారు. క్వారంటైన్ లో ఉంచడంతో పాటుగా వాళ్లకు ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు కూడా చేయించారు. అయితే.. కరోనా టెస్టుల్లో ముందుగా సింగర్ నోయల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తర్వాత మరికొందరికి కూడా కరోనా సోకినట్టు తెలిసింది. కరోనా సోకిన వాళ్లందరినీ షో నుంచి తప్పించి సపరేట్ గా ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అయితే.. ఇక షో టైమ్ దగ్గరపడటంతో చివరకు కంటెస్టెంట్లను ఫైనల్ చేసేసి ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసింది మాటీవీ యాజమాన్యం.

అయితే.. కరోనా వచ్చిన కంటెస్టెంట్లకు కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీయో.. లేదా వేరే ఎంట్రీయో.. ఏదో ఒక ఎంట్రీతో వాళ్లను హౌస్ లోకి తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

అంటే సింగర్ నోయల్ బిగ్ బాస్ ఎంట్రీ కన్ఫమ్ అన్నమాట. మరోవైపు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువనటుడు అభిజిత్ కూడా ఫైనల్ కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నాడు.

అలాగే కోరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కూడా బిగ్ బాస్ సీజన్ 4 కు సెలెక్ట్ అయ్యాడట. మరో కంటెస్టెంట్ గా దర్శకుడు సూర్య కిరణ్ రాబోతున్నాడు. ఈయన సుమంత్ తో సత్యం అనే సినిమా తీశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాలతో సూర్య కిరణ్ సినిమాలకు దూరమైనా.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

ఇంకా ఫైనల్ లిస్టులో ఉన్నవాళ్లు.. టీవీ9 యాంకర్ దేవీ నాగవల్లి..ఈమె కొన్ని రోజుల నుంచి టీవీ9లో వార్తలు చదవడం లేదు. అంటే ఈమె బిగ్ బాస్ హౌస్ కు చేరుకున్నట్టే అనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇంకా కరాటే కళ్యాణి, గంగవ్వ, మెహబూబ్ అలీ, అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, సురేఖా వాణి, లాస్య, హారిక కన్ఫమ్ అయిన లిస్టులో ఉన్నారు.