బిగ్ అప్డేట్ : విజయ్ “లియో” ట్రైలర్ కి డేట్ వచ్చేసింది..!

తమిళ సినిమా నాట బిగ్ స్టార్ అయినటువంటి తలపతి విజయ్ కూడా ఒకడు. మరి విజయ్ కెరీర్ లో భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న చిత్రమే ఇది కాగా ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా పైగా తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు అయితే నెలకొన్నాయి.

కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ దసరా కానుకగా అయితే పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ అండ్ సెన్సేషనల్ ప్లానింగ్స్ లో తీసుకొస్తుండగా ఈ చిత్రం నుంచి అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ అప్డేట్ ని అయితే మేకర్స్ ఇప్పుడు అందించేసారు. లోకేష్ కనగరాజ్ నుంచి అసలు ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి ఎవరెవరిని ట్రైలర్ లో చూపిస్తాడు.

మెయిన్ గా గత చిత్రం విక్రమ్ ఖైదీ చిత్రాలకి ఎలాంటి లింక్ చూపిస్తాడా లేదా అనేవి ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారాయి. ఇక ఈ అప్డేట్ తో రివీల్ చేసిన పోస్టర్ కూడా కేజ్రీగా ఉందని చెప్పాలి. విజయ్ తో పాటుగా మంచులో తన ఎదురుగా ఓ తోడేలు కనిపిస్తుంది.

దెబ్బ తగిలి ఉన్న విజయ్ ఆ తోడేలుతో పోరాటం చేస్తున్నట్టుగా దీనితో అయితే అనిపిస్తుంది. దీనితో ఈ ట్రైలర్ అనౌన్సమెంట్ పోస్టర్ ఓ రేంజ్ లో అదరగొట్టేస్తుంది. ఇంకా ఈ భారీ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
https://x.com/actorvijay/status/1708806566852366648?s=20