గత ఏడాదిలో టాలీవుడ్ డెలివర్ చేసిన పలు భారీ హిట్ చిత్రాల్లో అయితే ఒక యంగ్ సెన్సేషన్ గా వచ్చిన చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. అయితే ఇది అవ్వడానికి చిన్న సినిమానే అయినా వసూళ్ల పరంగా భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాతలకి అందించింది.
దీనితో అందుకే రెండో పార్ట్ పై మంచి హైప్ నెలకొంది. అయితే యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం రెండో సినిమాకి కూడా తాను రచనా సహకారం సహా దర్శకత్వ భాద్యతలు కూడా కొద్దిగా చూసుకుంటున్నాడు. మరి మేకర్స్ అయితే ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన ఈ చిత్రం అలా వాయిదా వేస్తూ వచ్చారు.
కానీ తమ సినిమా విషయంలో మాత్రం నమ్మకంగానే ఉన్నారు. కాగా నిన్ననే మేకర్స్ ఈరోజు అయితే ఓ భారీ అనౌన్సమెంట్ ఇస్తున్నట్టుగా చెప్పగా అదైతే చాలా మంది ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ కోసమే అని భావించారు. మరి ఇప్పుడు ఆ అంచనా నిజం చేస్తూ బ్రాండ్ న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు.
అయితే గత ఏడాదిలో ఏ నెలలో అయితే సినిమా రిలీజ్ అయ్యిందో ఈసారి పార్ట్ 2 ని కూడా అదే ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తున్నట్టుగా లాక్ చేశారు. అయితే గత చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయితే ఈసారి ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తానికి అయితే మాస్ అండ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి టిల్లు గాడి రచ్చ అప్పుడు నుంచి షురూ అవుతుంది అని చెప్పొచ్చు.
His-Story will repeat once again in theatres with #TilluSquare! 😎🕺
Tillu anna MASS is all set to blast the theatres with DOUBLE the FUN & DOUBLE ENTERTAINMENT from FEB 9th, 2024! 🔥🤩#TilluSquareOnFeb9th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli… pic.twitter.com/LPdKINmS18
— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2023