బిగ్ అప్డేట్ : సూర్య భారీ చిత్రం గ్లింప్స్ కి డేట్ లాక్.!

ఇప్పుడు మన సౌత్ ఇండియా సినిమా నుంచి అయితే రిలీజ్ కి రాబోతున్న పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో తమిళ సినీ పరిశ్రమ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “కంగువ” కూడా ఒకటి. తమిళ వెర్సటైల్ హీరో సూర్య హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ పీరియాడిక్ డ్రామా సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

అయితే ఓ యూనిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్న మేకర్స్ ఇపుడు ఫైనల్ గా ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి కోరుకుంటున్న సినిమా గ్లింప్స్ అప్డేట్ ని అయితే ఇపుడు మేకర్స్ రివీల్ చేశారు. ఓ స్టన్నింగ్ పోస్టర్ ని సూర్య పై రివీల్ చేస్తూ ఈ అవైటెడ్ వీడియో ని ఈ జూలై 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

దీనితో సూర్య ఫ్యాన్స్ కి ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ పోస్టర్ అయితే ఓ హాలీవుడ్ సినిమా లెవెల్లో కనిపిస్తుండడం విశేషం కాగా ఈ పోస్టర్ చూసాక సూర్య టోటల్ లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ మాసివ్ చిత్రానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.

చిత్ర వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 10 భాషల్లో అలాగే 3డి వెర్షన్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ చిత్రాన్ని మన తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు అలాగే తమిళ నిర్మాణ సంస్థ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.