“సూర్య 42” ఆడియోపై బిగ్ అప్డేట్.!

తమిళ సినిమా స్టార్ హీరో సూర్య తన కెరీర్ లో 42వ సినిమాని అయితే ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు శివతో చేస్తున్న ఈ సినిమా టైటిల్ మరియు రిలీజ్ అప్డేట్స్ రేపు రానున్నాయి. అయితే ఓ భారీ పీరియాడిక్ వండర్ గా సెన్సేషనల్ విజువల్స్ మరియు యాక్షన్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు బిగ్ అప్డేట్ అయితే అందించారు.

ఈ సినిమా తాలూకా అన్ని భాషల ఆడియో హక్కులని అయితే ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ వారు సొంతం చేసుకున్నట్టుగా మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్సమెంట్ లో రిలీజ్ చేసిన వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఆసక్తిని పెంచింది.

దీనితో తన నుంచి ఈ సినిమా ఆల్బమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అర్ధం అవుతుంది. అంతే కాకుండా ఈ వీడియోలో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరి మొత్తానికి అయితే ఈ మాసివ్ అప్డేట్ ని ఈరోజు అందించారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా గ్రీన్ స్టూడియోస్ సంస్థ వారు అలాగే మన దగ్గర టాలీవుడ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు అయితే ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రేపు సూర్య 42 టైటిల్ రిలీజ్ డేట్ లని ప్రభాస్ లాంచ్ చేయనున్నాడని రూమర్స్ ఉన్నాయి.