బిగ్ అప్డేట్ : శంకర్ “ఇండియన్ 2” గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే.. 

ఇండియన్ సినిమాని ఎప్పుడో తన విజయ్ అండ్ భారీ చిత్రాలతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్. కోలీవుడ్ లో ఎన్నో వండర్స్ తీసి హాలీవుడ్ దర్శకులకి సైతం తాను ప్రేరణగా నిలిచాడు. మరి భారీతనానికి భారీతనం సినిమాలో కాన్సెప్ట్ సహా మంచి మెసేజ్ తో కూడా ఎప్పుడు సమాజానికి ఏదోకటి చెప్పాలని ట్రై చేసే శంకర్ చేసిన సెన్సేషనల్ పేట్రియాట్ చిత్రాల్లో ఒకటే “ఇండియన్”.

ఉలగనయగన్ కమల్ హాసన్ చేసిన ఈ చిత్రానికి మాసివ్ సీక్వెల్ ఇప్పుడు అంతకి మించిన రేంజ్ లో తెరకెక్కిస్తుండగా ఈ భారీ సినిమా నుంచి ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ ఊహించని బిగ్ అప్డేట్ ని ఐతే రివీల్ చేశారు. కాగా ఈ భారీ చిత్రం నుంచి మొట్ట మొదటి గ్లింప్స్ టీజర్ ని ఈ నవంబర్ 3న విడుదల చేస్టున్నట్టుగా ఇప్పుడు అధికారికంగా ఓ స్పెషల్ పోస్టర్ తో అయితే అనౌన్స్ చేశారు.

దీనితో ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఒక్కసారిగా లేచాయని చెప్పాలి. కాగా ఇందులోనే ఈ చిత్రాన్ని తెలుగులో “భారతీయుడు 2” అనే విడుదల చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే శంకర్ మాస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరి ఈ చిత్రం అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కాజల్ అగర్వాల్ లు నటిస్తుండగా ఎస్ జె సూర్య సిద్ధార్త్ తదితరులు కూడా నటిస్తున్నారు అలాగే అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.