బిగ్ అప్డేట్ : “భోళా శంకర్” టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్డ్.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” తో అయితే భారీ హిట్ ని అందుకోగా ఇక మళ్ళీ మాస్ లో అయితే బాస్ మంచి కం బ్యాక్ ని ఇచ్చారు. ఇక దీని మాస్ హిట్ తో ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న రీమేక్ సినిమా “భోళా శంకర్” పై అయితే భారీ హైప్ వచ్చేసింది.

ఇక బాగోకపోయినా కూడా ఫస్ట్ సాంగ్ హిట్ అయ్యిపోయింది. ఇక రీసెంట్ గానే సినిమా టీజర్ ని రెడీ చేస్తున్నట్టుగా దర్శకుడు మెహర్ రమేష్ హింట్ ఇవ్వగా ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ అయితే భోళా శంకర్ టీజర్ పై బిగ్ అప్డేట్ ని అందించారు. మరి ఈ క్రేజీ టీజర్ అయితే ఈ జూన్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

దీనితో అయితే మెగా ఫ్యాన్స్ కి ఈ టీజర్ ఎలా నచ్చుతుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. అలాగే సుశాంత్ తదితరులు అయితే కీలక పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఆగష్టు 11 న అయితే గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లు చేస్తున్నారు. ఇది వరకే ఏజెంట్ తో చేతులు కాల్చుకున్న నిర్మాత ఈ రీమేక్ తో ఏదొక అద్భుతం జరిగితే తప్ప లాభాలు అందుకోరని చెప్పాలి.