బిగ్ అప్డేట్ : ఓటిటిలో రెండు డేట్స్ లో “లియో” రిలీజ్ కన్ఫామ్ 

ఈ ఏడాది సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ చిత్రం “లియో” కూడా ఒకటి. కాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం కాగా ఈ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించడంతో మంచి వచ్చింది.

కానీ కొన్ని ఈ సినిమా అనుకున్న రేంజ్ అంచనాలకి కొంచెం తక్కువ అందుకుంది. దీనితో ఇక నెక్స్ట్ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూసారు. అయితే నిజానికి ఈ సినిమా ఈ నవంబర్ 19న నెట్ ఫ్లిక్స్ లో రావాల్సి ఉంది కానీ మరో వారం వాయిదా పడొచ్చు అనే సమాచారం కూడా మేము అందజేశాం.

ఇప్పుడు చెప్పినట్టుగానే కొత్త రిలీజ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇంట్రెస్టింగ్ రెండు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది. మొదటగా పాన్ ఇండియా భాషల్లో అయితే ఓన్లీ ఇండియా వెర్షన్ లో ఈ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

అలాగే నెక్స్ట్ అయితే గ్లోబల్ వెర్షన్ లో ఈ నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా రెండు డేట్స్ అనౌన్స్ చేశారు. బహుశా ఇలా మొదటిసారి అని చెప్పాలి. సో లియో ఓటిటి విడుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.