శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఇటీవలే మళ్లీ ఊపందుకుంది. మధ్యలో ఈ సినిమాకు చాలా సార్లు గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు అనుకున్నప్పుడు నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. అయినప్పటికీ కమల్ హాసన్ ఈ ప్రాజెక్టును చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. దర్శకుడు శంకర్ ప్రొడక్షన్ హౌస్ లైకా మధ్యలో చాలా సార్లు విభేదాలు వచ్చాయి.
అయినప్పటికీ కమల్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇరువైపులా చర్చలు జరిపి ప్రాజెక్టును వేగవంతం చేశాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం హాట్ టాపిక్ గా మారుతుంది. దర్శకుడు శంకర్ ఎవరికి చెప్పకుండానే 3వ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా కొనసాగించినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా శంకర్ తన సినిమాకు సంబంధించిన గాసిప్స్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏ విషయాన్ని కూడా బయటకు లీక్ ఇవ్వకుండా సెక్యూరిటీని కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన 70% షూటింగ్ పూర్తయింది. అయితే ఇందులో భాగంగానే దర్శకుడు శంకర మూడవ పార్ట్ కి సంబంధించిన సగానికి పైగా షూటింగ్ కూడా చేశాడట.
సినిమా నిడివి దాదాపు 6 గంటలు రావడంతో రెండు భాగాలుగా విభజించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ తమిళ మీడియాలో మాత్రం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక మరోవైపు దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా ఫినిష్ అయ్యింది. ఇక ఈ సినిమా ఇండియన్ 2 ప్రాజెక్టు రిలీజ్ అయిన తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. ఇక దీని తర్వాత ఇండియన్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.