ఆ ఇద్దరు హీరోయిన్స్ ని ఒకే చిత్రంలో పెడుతున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఇక!

big heroines in tollywood will be act in vyjayanthi banner upcomming movie with dulqar salman

వరుస హిట్ సినిమాలతో , క్రేజీ ప్రాజెక్ట్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హవా అంతా హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్న మరియు కీర్తి సురేష్లదే . ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ లో ఊపు ఊపుతున్నారు అనడంలో సందేహం లేదు.ఈ మధ్య కీర్తి పాప జోరు తగ్గింది కానీ పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నల జోరు మామూలుగా లేదు. వీరిద్దరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిపిస్తుంది.

\

big heroines in tollywood will be act in vyjayanthi banner upcomming movie with dulqar salman
Rashmika mandanna and pooja hegde

ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ వారు హను రాఘవపూడి దర్శకత్వంలో అన్ని సౌత్ భాషల ప్రేక్షకుల కోసం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. భారీ బడ్జెట్ తో దత్ గారి ఇద్దరు కూతుర్లు కూడా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్స్ ను ఎంపిక చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సాదారణంగా ఒక స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేస్తే మరో చిన్న హీరోయిన్ ను ఎంపిక చేస్తారు. కాని ఈ సినిమా కోసం మాత్రం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను ఎంపిక చేశారు.

హీరోయిన్స్ పారితోషికం ఎక్కువ అయినా కూడా వీరిద్దరికి సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా మంచి బిజినెస్ అన్ని భాషల్లో అవుతుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని విషయాలకు సంబంధించి పూర్తి క్లారిటీని యూనిట్ సభ్యులు ఇచ్చే అవకాశం ఉంది.