‘భోళా శంకరుడు’.! మసాలా గట్టిగా దట్టిస్తున్నాడు.!

తమిళ సినిమాల్ని తెలుగులోకి రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. అలా రీమేక్ చేసిన సినిమాలు, ఒరిజినల్ వెర్షన్స్ కంటే సంచలన విజయాలు సాధించిన సందర్భాలున్నాయి. ఒకటీ అరా సందర్భాల్లో రీమేకులు దెబ్బ కొట్టడం కూడా చూశాం.

ఇంతకీ, ‘భోళా శంకర్’ సంగతేంటి.? ఇది ‘వేదాళం’ సినిమాకి తెలుగు రీమేక్. తెలుగులోనూ ‘వేదాళం’ సినిమా అందుబాటులోనే వుంది. దాన్ని ఎందుకు రీమేక్ చేస్తున్నారబ్బా.?

ఏమోగానీ, ‘వేదాళం’ సినిమాకైతే కమర్షియల్ అంశాలు సరికొత్తగా దట్టిస్తున్నారట తెలుగులో. ఒరిజినల్ వెర్షన్‌తో పోల్చితే అస్సలు సంబంధం లేకుండా తెలుగు వెర్షన్‌ని మార్చిపారేశారట.

కథలో మార్పులు చేర్పులే కాదు, స్క్రీన్ ప్లే విషయంలో కూడా చిరంజీవి స్వయంగా మార్పులు చేశారని తెలుస్తోంది. పాటల విషయంలో చిరంజీవి మార్కు ఎలాగూ వుంటుంది. ‘సినిమా చూస్తే, రీమేక్ అని ఎవరూ అనరు’ అని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.