మెగాస్టార్ లైనప్ లో బిగ్ ఛేంజ్..!

టాలీవుడ్ మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రీసెంట్ సినిమా “భోళా శంకర్” భారీ డిజాస్టర్ కాగా ఈ చిత్రం తర్వాత మెగా ఫ్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రీమేక్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యిపోయారు. తమ బాస్ తన రేంజ్ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నారు.

దీనితో అలా మెగాస్టార్ రెండు భారీ చిత్రాలు అనౌన్స్ చేయగా ఆ చిత్రాల్లో అంతా ఆసక్తిగా చూస్తున్న ఆ సినిమానే “మెగాస్టార్ 157”. దర్శకుడు వశిష్ఠ బింబిసార ఫేమ్ దీనిని తెరకెక్కిస్తుండగా అనౌన్స్ చేయడంతోనే ఈ సినిమాపై సెన్సేషనల్ హైప్ నెలకొంది. కాగా ఈ చిత్రం విషయంలో ఇపుడు బిగ్ ఛేంజ్ అయితే నమోదు అయ్యింది.

నిజానికి దీనికన్నా ముందు మెగాస్టార్ 156వ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కీలక నిర్ణయాలతో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 157వ సినిమా 156వ సినిమాగా జరిగింది. దీనితో ఈ మాసివ్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి మాత్రం గట్టి పూనకాలే ఇప్పుడు వస్తున్నాయి. అసలే ఈ సినిమా మళ్ళీ ఒక అంజి ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో అంటున్నారు.

చిరు కూడా ఇలాంటి సాలిడ్ ఫాంటసీ థ్రిల్లర్ లు చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. దీనితో ఈ సినిమాపై అంచనాలు అంత ఉన్నాయి. కాగా ఈ భారీ సినిమాని అయితే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా అతి త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది.