కూతురి పెళ్ళి విషయంలో కండిషన్ పెట్టిన బోని కపూర్.. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్?

ప్రపంచ సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దఢక్ సినిమా ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ నటించిన సినిమాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటో షూట్లకు ఫోజులిస్తూ గ్లామర్ షో చేసే ఈ అమ్మడి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన గ్లామర్ తో రచ్చ చేస్తుంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న జాన్వీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ పెళ్లి విషయంలో తన తండ్రి ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఒక విషయంలో మాత్రం కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. జాన్వి కపూర్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనకన్నా ఎక్కువ హైట్ ఉండాలని బోనికపూర్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. బోనీ కపూర్ 6.1 అడుగుల ఎత్తు ఉండగా, జాన్వీ కపూర్ ని పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి మినిమం 6.2 అడుగుల ఎత్తు ఉండాలని బోని కపూర్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ మా నాన్న మమల్ని ప్రపంచమంతా తిపారని తను చేసుకోబోయే వ్యక్తితో చెప్పాలని బోని కపూర్ చెప్పారట. అంటే బోని కపూర్ తన పిల్లలని ఎంత ప్రేమగా చూసుకున్నాడు వారిని పెళ్ళిచేసుకోబోయే వ్యక్తి అంతా కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోవాలని బోని కపూర్ ఆశ.

ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అంతే కాకుండా దోస్తానా 2 సినిమాలో కూడా జాన్వీ నటిస్తోంది. ప్రస్తుతం జాన్వీ గుడ్ లక్ జెర్రీ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రపంచ సుందరి శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమయింది. టాలివుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికీ అక్కడ నటించటానికి ఆమె ఆసక్తి చూపటం లేదు. ఇక ఈ అమ్మడు సినిమాలలో మాత్రమే కాకుండా కొన్ని వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.